బీసీల రాజ్యాధికారం కోసం కొత్త పార్టీ పెడతా: ఆర్. కృష్ణయ్య
హైదరాబాద్: బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త పార్టీ పెడతానని ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య చెప్పారు. బీసీ సంఘాలతో పార్టీ ఏర్పాటు విషయమై చర్చించనున్నట్టు ఆయన ప్రకటించారు.
గురువారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. అగ్రవర్ణాలకు ఓట్లు వేసి హక్కుల కోసం బిచ్చమెత్తుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే పార్టీ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.

ఏపీలో బీసీలకు చంద్రబాబునాయుడు కూడ న్యాయం చేయడం లేదని ఆయన విమర్శలు గుప్పించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా ఆత్మగౌరవ పోరాటం చేస్తామని ఆర్. కృష్ణయ్య చెప్పారు.
బీసీలకు న్యాయం జరగాలంటే కొత్త పార్టీ ఏర్పాటు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయమై బీసీ సంఘాలతో చర్చించనున్నట్టు ఆయన చెప్పారు. రాజకీయాలకు అతీతంగా అందరూ కలసికట్టుగా పోరాడాలన్నారు. జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. అన్ని పార్టీలు ఓట్ల కోసమే బీసీలను వాడుకుంటున్నాయని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు.












Click it and Unblock the Notifications