వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాబుతో ఆర్. కృష్ణయ్య భేటీ: తెలంగాణను చూసైనా, బీసీ సంక్షేమంపై ఇలా..

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబునాయుడును ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య ఆదివారం నాడు భేటీ అయ్యారు. ఏపీలో బీసీలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టే విషయమై చంద్రబాబుకు ఆర్. కృష్ణయ్య వినతి పత్రం సమర్పించారు. కాపులకు ఏపీలో రిజర్వేషన్లు కల్పించిన సమయంలో ఆర్. కృష్ణయ్య చంద్రబాబుపై ఫైరయ్యారు. అయితే బాబుతో ఆర్.కృష్ణయ్య సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

ఏపీ రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయమై విపక్షాలు విమర్శలు చేస్తున్న సమయంలోనే తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న ఆర్. కృష్ణయ్య కాపు రిజర్వేషన్లపై తన నిరసన గళం విన్పించారు.

బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించనున్నట్టు టిడిపి పదే పదే ప్రస్తావిస్తోంది.అయితే ఏపీ రాష్ట్రంలో కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయమై ఆర్. కృష్ణయ్య నిరసన గళం విన్పించడం టిడిపికి ఇబ్బందిని గురి చేసింది.

 చంద్రబాబుతో ఆర్. కృష్ణయ్య భేటీ

చంద్రబాబుతో ఆర్. కృష్ణయ్య భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య ఆదివారం కలిశారు. తెలంగాణ ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం మరిన్ని పథకాలు ప్రవేశపెడుతోందని, ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీసీలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించే విషయమై ఆర్. కృష్ణయ్య విబేధించిన సమయంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకొంది.

 తెలంగాణ తరహలో ఏపీలో సంక్షేమ పథకాలు

తెలంగాణ తరహలో ఏపీలో సంక్షేమ పథకాలు

తెలంగాణ రాష్ట్రంలో మాదిరిగానే ఏపీ రాష్ట్రంలో కూడ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాలని ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు ఆర్. కృష్ణయ్య వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం అమలు చేయాల్సిన పథకాలపై అన్ని పార్టీలతో చర్చించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా బీసీలకు మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. రూ.20వేల కోట్లతో బీసీ ఉపప్రణాళిక ఏర్పాటు చేయాలన్నారు.

 చట్ట సభల్లో బీసీలకు 50 రిజర్వేషన్లు కల్పించాలి

చట్ట సభల్లో బీసీలకు 50 రిజర్వేషన్లు కల్పించాలి

చట్టసభల్లో బీసీలకు 50శాతం స్థానం కల్పించే దిశగా కృషి చేయాలని చంద్రబాబునాయుడును ఆర్. కృష్ణయ్య కోరారు.. బీసీ రిజర్వేషన్ల కోసం అఖిలపక్షాన్ని దిల్లీని తీసుకెళ్లాలని చేసిన విజ్ఞప్తిని చంద్రబాబు అంగీకరించారన్నారు. త్వరలోనే ప్రధాని అపాయింట్‌మెంట్‌ తీసుకుని అఖిలపక్షాన్ని దిల్లీకి తీసుకెళ్తామని చంద్రబాబు చెప్పినట్లు కృష్ణయ్య తెలిపారు.

 చంద్రబాబుతో భేటీ ప్రాధాన్యత

చంద్రబాబుతో భేటీ ప్రాధాన్యత

ఏపీలో కాపుల రిజర్వేషన్లను ఇవ్వడాన్ని ఆర్. కృష్ణయ్య తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల బీసీలకు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని కృష్ణయ్య అభిప్రాయపడ్డారు. బీసీలకు రిజర్వేషన్లకు నష్టం కలగకుండా ఉండాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. ఈ సమయంలో ఏపీ రాష్ట్రంలో కూడ బీసీల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని కృష్ణయ్య కోరారు.

English summary
Bc leader, LB Nagar MLA R. Krishnaiah meeting with Ap CM Chandrababu naidu on Sunday at Hyderabad at his Residence. R.Krishnaiah gave a memorandum on BC's demands to Chandrababu naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X