కీచక టీచర్: బాలికలతో అసభ్యం, 9వ తరగతి విద్యార్ధినిని లేవదీసుకుపోయాడు
హైదరాబాద్: పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని మభ్యపెట్టి విద్యార్ధినులను లొంగదీసుకున్న కీచక టీచర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ బాలికను లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. పోలీసుల కథనం ప్రకారం వరంగల్ జిల్లా గణపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో సాయి మణిదీప్ అనే ఫిజిక్స్ టీచర్ క్లాసులోని బాలికలతో అసభ్యంగా ప్రవర్తించేవాడు.
టీచర్ కాబట్టి పిల్లలు చనువుగా ఉండటం సహాజం. అయితే ఇదే చనువుని ఆసరాగా చేసుకుని విద్యార్ధినిలపై రెచ్చిపోయాడు. పరీక్షల్లో ఎక్కువ మార్కులు వేస్తానని వారికి మరింతగా దగ్గరయ్యేవాడు. ఈ క్రమంలో 9వ తరగతికి చెందిన ఓ బాలికను మభ్యపెట్టి పెళ్లి చేసుకుంటానని చెప్పి నెలరోజుల క్రితం వెంట తీసుకెళ్లాడు.
అయితే కుమార్తె కనిపించకపోవడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు గుణపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అతడి సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హన్మకొండలోని రాంనగర్‌కు చెందిన శివసాని మణిదీప్ (26) ఓ ప్రైవేట్ పాఠశాలలో పీఈటీగా, టీచర్‌గా పనిచేసేవాడు.

2011లో హన్మకొండలోని ఓ పాఠశాలలో పీఈటీగా పనిచేస్తూ అమ్మాయిలపై వేధింపులకు పాల్పడ్డాడు. 2013లో కాశిబుగ్గకు చెందిన ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారికి 14 నెలల కొడుకు ఉన్నాడు. 2014లో హుజారాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తూ బాలికలను మానసికంగా వేధించడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మణిదీప్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
ఆ తర్వాత కీర్తి మార్కెటింగ్ కొరియర్ సర్వీసులో పనిచేస్తూ 1.28 లక్షల విలువైన ధనలక్ష్మీ యంత్రాలను కాజేసినందుకు ఇంతెజార్ గంజ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో అతడిపై రౌడీషీట్ తెరుస్తామని వరంగల్ ఏఎస్పీ విశ్వజిత్ తెలిపారు.












Click it and Unblock the Notifications