పాఠాలు చెప్పమంటే..బూతు బొమ్మలు చూపుతున్నాడని విధ్యార్థులు ఏం చేశారంటే
విధ్యార్థులకు పాఠాలు చెప్పకుండా ట్యాబ్ లో అశ్లీల చిత్రాలకు విధ్యార్థులకు చూపిస్తూ లైంగిక వేధింపులకు పాల్పడుతున్న మోహనవర్మ అనే టీచర్ ను విధ్యార్థుల తల్లిదండ్రులు చితకబాది పోలీసులకు అప్పగించిన ఘటన హైద్ర
హైదరాబాద్ :పవిత్రమైన టీచర్ వృత్తిలో ఉన్నాడు. విధ్యార్థులు మంచి మార్గంలో తీసుకువెళ్ళాల్సిన వాడు. కాని ఆయన బుద్ది వక్రమార్గంలో పయనించింది. విధ్యార్థులకు పాఠాలు చెప్పకుండా ట్యాబ్ లో అశ్లీల చిత్రాలతో విధ్యార్థినులను వేధిస్తున్నాడు. తప్పుడు మార్గంలో పనిచేస్తోన్న టీచర్ ను చితకబాదారు విధ్యార్థుల తల్లిదండ్రులు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
హైద్రాబాద్ నాగోల్ వెంకటరమణ కాలనీ నివాసం ఉండే మోహన వర్మ అరుణోదయ కాలనీలోని జనప్రియ ఒలంపియాడ్ స్కూల్లో భౌతికశాస్ర్తం బోధిస్తాడు. 8,9 తరగతి విధ్యార్థులకు ఆయన ఫిజిక్స్ చెబుతాడు. పవిత్రమైన ఉపాధ్యాయవృత్తిలో ఉంటూ రెండేళ్ళుగా పాడు పనులు చేస్తున్నాడు.

రెండేళ్ళుగా పాఠశాలలో విధ్యార్థినులను ఆయన వేధిస్తున్నాడు. ట్యాబ్ ద్వారా విధ్యార్థులకు ఆయన పాఠాలు బోధిస్తుంటాడు. అయితే ట్యాబ్ ద్వారా పాఠాలు బోధించడం అదనుగా తీసుకొన్నాడు. ట్యాబ్ సహయంతో ఫోర్న్ సైట్ లోని అశ్లీల చిత్రాలను విధ్యార్థులకు చూపేవాడు.
ట్యాబ్ లోని అశ్లీల చిత్రాలను చూపుతూ లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. రెండేళ్ళుగా ఈ తతంగాన్ని సాగిస్తున్నప్పటికీ విషయం మాత్రం మంగళవారం నాడు వెలుగుచూసింది. విషయం తెలుసుకొన్న విధ్యార్థుల తల్లిదండ్రులు మోహనవర్మను స్కూల్లోనే చితకబాదారు. నిందితుడిని పోలీసులకు అప్పగించారు.
పవిత్రమైన టీచర్ వృత్తిలో ఉన్నాడు. విధ్యార్థులు మంచి మార్గంలో తీసుకువెళ్ళాల్సిన వాడు. కాని ఆయన బుద్ది వక్రమార్గంలో పయనించింది. విధ్యార్థులకు పాఠాలు చెప్పకుండా ట్యాబ్ లో అశ్లీల చిత్రాలతో విధ్యార్థినులను వేధిస్తున్నాడు. తప్పుడు మార్గంలో పనిచేస్తోన్న టీచర్ ను చితకబాదారు విధ్యార్థుల తల్లిదండ్రులు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.












Click it and Unblock the Notifications