ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక: బీజేపీ బలపరిచిన ఏవీఎన్ రెడ్డి విజయం; బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్!!
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో అనూహ్య ఫలితం వచ్చింది. బీజేపీ బలపరిచిన ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. బీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్ తగిలింది.
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల సమరానికి ముందు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎన్నికలకు వెళ్లాయి. అయితే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో బీఆర్ఎస్ మెజారిటీ కారణంగా ముగ్గురు బి ఆర్ ఎస్ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా విజయం సాధించారు. కానీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో ఊహించని విధంగా బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చే ఫలితాలు వచ్చాయి. బిజెపి బలపరిచిన అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగిన ఏవీఎన్ రెడ్డి విజయాన్ని కైవసం చేసుకున్నారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి విజయం
వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెమీస్ గా ఈ ఎన్నికలను భావించిన ప్రధాన పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారం చేశాయి. ఎప్పుడైనా ఎన్నికలలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషించే అవకాశం ఉంది కాబట్టి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలను అటు బిఆర్ఎస్, ఇటు బిజెపి కీలకంగా తీసుకున్నాయి. అయితే బిజెపి ఈ ఎన్నికల ఫలితాలలో విజయం సాధించి గులాబీ అధినేతకు షాక్ ఇచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చి మరీ బండి సంజయ్ చేసిన ప్రచారం, అభ్యర్థి మీద ఉన్న నమ్మకం వెరసి ఏవీఎన్ రెడ్డి గెలిచారు.

అర్దరాత్రి దాకా కౌంటింగ్.. బీజేపీ అభ్యర్థి 1150 ఓట్ల తేడాతో విజయం
ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక హోరాహోరీగా సాగింది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ లో ఎవరు ఊహించని విధంగా ఫలితాలు రావడం ఇప్పుడు వచ్చే ఎన్నికలపై అందరిని ఆలోచించేలా చేస్తుంది. హోరా హోరీగా సాగిన వీరి పోటీలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి పిఆర్టియుటిఎస్ అభ్యర్థి అయిన గుర్రం చెన్నకేశవరెడ్డి పై సుమారు 1150 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

ఉత్కంఠగా సాగిన ఎన్నికల కౌంటింగ్ .. మొదటి ప్రాధాన్యత ఓట్లలో తేలని మెజార్టీ
మొదటినుంచి ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ గురువారం అర్ధరాత్రి 1:40 నిమిషాల వరకు కొనసాగింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఫలితాలు తేలకపోవడంతో, రెండో ప్రధానితో ఓట్ల లెక్కింపు చేయవలసి వచ్చింది. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఏ పార్టీ అభ్యర్థికి సరైన మెజారిటీ రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు.

బీఆర్ఎస్ ను ఆలోచనలో పడేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు
ఇక మూడవ స్థానంలో ఉన్న టీఎస్యుటిఎఫ్ అభ్యర్థి పాపన్న గారి మాణిక్ రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండవ ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాలలోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో బిజెపి బలపరిచిన అభ్యర్థిగా బరిలోకి దిగిన ఏవీఎన్ రెడ్డి విజయం దక్కించుకున్నారు. మొత్తానికి బిజెపి నాయకులు తాము మద్దతు ఇచ్చిన ఏవీఎన్ రెడ్డి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయం సాధించడంతో, బీఆర్ఎస్ పార్టీకి వచ్చే ఎన్నికలకు సంబంధించి పెద్ద టాస్క్ ను ముందు పెట్టినట్టు అయ్యింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications