కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు: అంత్యక్రియలకు కెసిఆర్, నేతల హాజరు(పిక్చర్స్)

మెదక్: ఐదు దశాబ్దాల పాటు ప్రజాసేవకు అంకితమై నిద్రలోనే తుదిశ్వాస విడిచిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డికి వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అధికార లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలను నిర్వహించారు.

బుధవారం ఉదయం 9.50 గంటలకు నారాయణఖేడ్‌లోని కిష్టారెడ్డి స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు వేల సంఖ్యలో తరలిరావడంతో నారాయణఖేడ్ పట్టణం జనసంద్రమైంది.

స్వగ్రామంలోని ఇంటికి తీసుకువెళ్లి గ్రామస్థుల సందర్శనార్థం అరగంట పాటు భౌతికకాయాన్ని ఇంటి ముందుంచారు. అక్కడి నుంచి కిష్టారెడ్డి వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన అంతిమ సంస్కారాల కార్యక్రమం వద్దకు పార్థివదేహాన్ని తరలించారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

ఐదు దశాబ్దాల పాటు ప్రజాసేవకు అంకితమై నిద్రలోనే తుదిశ్వాస విడిచిన నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డికి వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. అధికార లాంఛనాలతో బుధవారం అంత్యక్రియలను నిర్వహించారు.

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, సిఎల్‌పి నేత జానారెడ్డి, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపి వి హన్మంతరావు తదితర కాంగ్రెస్ ముఖ్య నేతలు అంత్యక్రియలకు హాజరయ్యారు.

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

బుధవారం ఉదయం 9.50 గంటలకు నారాయణఖేడ్‌లోని కిష్టారెడ్డి స్వగృహం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది.

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

నారాయణ్ ఖేడ్ నియోజకవర్గంతో పాటు జిల్లా నలుమూలల నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు వేల సంఖ్యలో తరలిరావడంతో నారాయణఖేడ్ పట్టణం జనసంద్రమైంది.

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

స్వగ్రామంలోని ఇంటికి తీసుకువెళ్లి గ్రామస్థుల సందర్శనార్థం అరగంట పాటు భౌతికకాయాన్ని ఇంటి ముందుంచారు.

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

అక్కడి నుంచి కిష్టారెడ్డి వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసిన అంతిమ సంస్కారాల కార్యక్రమం వద్దకు పార్థివదేహాన్ని తరలించారు. కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు మధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు.

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

కిష్టారెడ్డికి కన్నీటి వీడ్కోలు

మధ్యాహ్నం 1.20 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ హెలికాప్టర్‌లో నారాయణఖేడ్‌లోని అనురాధ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పంచగామ గ్రామానికి చేరుకున్నారు.

పెద్ద కుమారుడు డాక్టర్ సంజీవరెడ్డి తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
మధ్యాహ్నం 1.20 గంటలకు ముఖ్యమంత్రి కెసిఆర్ హెలికాప్టర్‌లో నారాయణఖేడ్‌లోని అనురాధ డిగ్రీ కళాశాల వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి కాన్వాయ్‌లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి పంచగామ గ్రామానికి చేరుకున్నారు.

సిఎం కెసిఆర్ నేరుగా చితి వద్దకు చేరుకుని పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీలకు చెందిన వారు వెళ్లి కడసారిగా తమ అభిమాన నాయకుడికి నివాళులర్పించారు. భర్త మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య గాలమ్మను ఓదార్చుతూ మాజీ మంత్రి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునితా లక్ష్మారెడ్డి సైతం కన్నీటి పర్యంతమయ్యారు.

గౌరవ వందనం నిర్వహించిన అనంతరం పోలీసులు మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. అనంతరం కిష్టారెడ్డి కుమారుడు సంజీవరెడ్డి తన తండ్రి చితికి నిప్పంటించారు. బీచ్కుంద పీఠాధిపతి సోమాయప్ప ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించగా పంచగామ పీఠాధిపతి సోమాయప్ప, మల్లన్న గట్టు స్వామి అవధూత మహారాజులు హాజరయ్యారు.

అంత్యక్రియల్లో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపి బిబి పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ రాజమణి మురళీ యాదవ్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, బాబుమోహన్, రామలింగారెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేణుగోపాలచారి, ఎమ్మెల్సీలు రాములు నాయక్, పాతూరి సుధాకర్‌రెడ్డి, ఖేడ్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణరెడ్డి, కాంగ్రెస్ నేతలు మల్లు భట్టివిక్రమార్క, వి.హన్మంతరావు, శశిధర్‌రెడ్డి, జి.చిన్నారెడ్డి, డికె అరుణ, సబితారెడ్డి, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, దామోదర్ రాజనర్సింహ, కోదండరెడ్డి, యాదవరెడ్డి, జగ్గారెడ్డి, జీవన్‌రెడ్డి, శ్రావణ్‌కుమార్, సునితాపాటిల్, సురేష్ షెట్కార్, తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+