టెక్కీ:పెళ్ళై ఆరు మాసాలు కూడ కాలేదు, భార్య ఇలా...భర్త అలా..

రోడ్డు ప్రమాదం ఓ కుటుంబాన్ని విషాదంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో టెక్కీ మరణించగా, ఆమె భర్త తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

హైదరాబాద్:ఆరు మాసాల క్రితమే వివాహమైంది.నిత్యం ఇద్దరూ కలిసి విధులకు హజరౌతుంటారు. కాని, ఓ ప్రమాదం వారి ఆశలను చిదిమేసింది. ఈ ప్రమాదంలో భార్య అక్కడికక్కడే మరణించింది. భర్త తీవ్ర గాయాలతో చికిత్సపొందుతోంది. ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.

విశాఖపట్టణానికి చెందిన వడ్డాది ఐశ్వర్యకు ఆరు మాసాల క్రితం కాకినాడకు చెందిన గుండు సుబ్రహ్యణ్యదత్త అవినాష్ తో వివాహమైంది. ఇరువురు ప్రతి రోజూ బైక్ పై ప్రతి రోజూ విధులకు వెళ్తుంటారు.

techie died in road accident

విధులకు వెళ్ళేందుకు వీలుగా ఉంటుందని నిజాంపేటలోనే ఇల్లు తీసుకొని నివసిస్తున్నారు.అయితే మంగళవారం నాడు విధులకు హజరయ్యేందుకుగాను ఇరువురు ఇంటి వద్ద నుండి ద్విచక్రవాహనంపై బాచుపల్లి మీదుగా కొండాపూర్ కు వెళ్తున్నారు. అయితే జెఎస్ఎన్ నగర్ వద్ద వెనుక నుండి వచ్చిన రెడీమిక్స్ లారీ వారు ప్రయాణీస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఐశ్వర్య అక్కడిక్కడే మరణించింది.అవినాష్ తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతోంది. ఈ ఘటన రెండు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. పెళ్ళై ఆరుమాసాల గడవక ముందే ఐశ్వర్య మరణించడం ఆ కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+