నదిలో మునిగి టెక్కీ మృతి, మూసీలో దొరికిన బాలుడి మృతదేహం
హైదరాబాద్: ఈత సరదా ఓ టెక్కీ ప్రాణం తీసింది. బంధువులతో కలిసి కాగ్నా నదిలో దిగి అతడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. బషీరాబాద్ మండలానికి చెందిన ఓ జంట కొన్నేళ్లుగా హైదరాబాదులో నివసిస్తోంది.
వీరి చిన్న కొడుకుయూసఫ్ ఖాన్ (26) ఇంజనీరింగ్ పూర్తి చేసి సాఫ్టువేర్ ఇంజనీర్ పని చేస్తున్నాడని తెలుస్తోంది. బంధువుల ఇంట్లో శుభకార్యం కోసం అతను బషీరాబాద్ వెళ్లాడు. ఆదివారం బంధువులు, స్నేహితులతో కలిసి కాగ్నా నదిలో ఈతకు వెళ్లాడు.
ఈత రాకపోవడంతో అతను నీట మునిగాడు. స్నేహితులు, బంధువులు గాలించినా ఫలితం లేకుండాపోయింది. సాయంత్రం ఐదు గంటలకు మృతదేహం లభ్యమైందని తెలుస్తోంది.

బాలుడి మృతదేహం లభ్యం
చాదర్ ఘాట్ శంకర్ నగర్ వద్ద ఆదివారం మూసీ నదిలో కొట్టుకుపోయిన తరుణ్ అనే బాలుడి మృతదేహాన్ని పోలీసులు సోమవారం గుర్తించారు. గోల్నాకలో బాలుడి మృతదేహాన్ని గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఆ బాలుడు తమ పిల్లాడేనని తల్లిదండ్రులు నిర్ధారించారు.
గోదావరిలో మునిగి ఇద్దరి మృతి
గోదావరి నదిలో స్నానం చేస్తూ ఆదివారం కృష్ణా జిల్లా విస్సన్నపేట మండలం రెడ్డిగూడేనికి చెందిన ఇద్దరు మృతి చెందారు. స్నానం చేస్తూ గోదావరి లోతును అంచనా వేయలేకపోవడం వల్లే గోపి అనే వ్యక్తి మునిగిపోతుండగా.. మేనమామ కాపాడేందుకు వెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు












Click it and Unblock the Notifications