భార్య-తల్లి గొడవ, మానసిక ఒత్తిడి: టెక్కీ ఆత్మహత్య

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: కుటుంబంలో తలెత్తిన చిన్నపాటి వివాదానికి మనోవేధనకు గురైన ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.

మాదాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ కళింగరావు తెలిపిన వివరాల ప్రకారం.. హర్యానా రాష్ట్రానికి చెందిన రంజిత్‌సింగ్‌(28) కొండాపూర్‌ శిస్పా పార్కు ప్రాంతంలో నివాసం ఉంటూ మాదాపూర్‌ మైండ్‌ స్పేస్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తుంటారు.

 A techie, from haryana, allegedly committed suicide in Hyderabad

అయితే అప్పుడప్పుడు భార్య, తల్లి మధ్య చిన్నపాటి వివాదం తలెత్తుతుండేది. ఈ నేపథ్యంలో రంజిత్ గత కొంత కాలంగా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. శనివారం సాయంత్రం భార్య ఇంట్లోలేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

రంజిత్ తమ్ముడు విక్రంజీత్‌సింగ్‌ ఫిర్యాదుతో పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చూరీకి తరలించారు. ఘటనపై కేసునమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A techie, from haryana, allegedly committed suicide in Hyderabad on Sunday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి