ఓ టెక్కీ నిర్వాకం.. అశ్లీల వెబ్‌సైట్‌లో మరదలి ప్రొఫైల్ ఉంచి..

Posted By:
Subscribe to Oneindia Telugu

కరీంనగర్‌: భార్య, ఆమె కుటుంబ సభ్యులపై పగ తీర్చుకోవాలని భావించిన ఓ వ్యక్తి ఏకంగా తన మరదలి ప్రొఫైల్ ను అశ్లీల వెబ్ సైట్ లో పొందుపరిచాడు. వృత్తిరీత్యా టెక్కీ అయిన అతడు ఎక్కడా దొరక్కుండా జాగ్రత్తపడినా ఫలితం లేకపోయింది. సోమవారం పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.

పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి కథనం ప్రకారం... కరీంనగర్‌లోని ముకరంపురకు చెందిన అజార్‌ మోహినోద్దిన్‌ తమీం (35) హైదరాబాద్‌లోని ఐబీఎం కంపెనీలో డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పని చేస్తున్నాడు. అతనికి 2013లో ముకరంపురకే చెందిన యువతితో వివాహమైంది.

porn-websites-fake-profile

తమీంకు వివాహేతర సంబంధాలు ఉండటం.. అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో అతడి భార్య 2017 జూన్‌ 6న పోలీసులను ఆశ్రయించింది. దీంతో భార్యపై కోపం పెంచుకున్న తమీం ఎలాగైనా ఆమె కుటుంబాన్ని అప్రతిష్టపాల్జేయాలని నిర్ణయించుకున్నాడు.

ఇంజనీరింగ్‌ చదువుతున్న మరదలిని లక్ష్యంగా చేసుకున్నాడు. ఆమె పేరిట ఓ నకిలీ మెయిల్‌ ఐడీని తయారు చేసి.. ఇంటర్నెట్‌లోని అశ్లీల వెబ్‌సైట్లలో ఓ ప్రొఫైల్‌ను సెల్‌నంబర్‌తో సహా సృష్టించాడు. సదరు నంబర్‌కు ఫోన్‌ చేసి శారీరకవాంఛలు తీర్చుకోవచ్చంటూ పోస్ట్‌ చేశాడు.

ఇది చూసిన కొందరు ఆ మొబైల్‌ నంబరుకు ఫోన్‌ చేస్తూ అభస్యకరంగా మాట్లాడటం.. మెసేజ్‌లు చేయడం ప్రారంభించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన తమీం మరదలు ఇటీవల ఆత్మహత్యకు యత్నించింది. ఈ క్రమంలో కుటుంబసభ్యులు ధైర్యం చెప్పి.. వన్‌ టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసుకున్న వన్‌టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌రావు అశ్లీల వెబ్‌సైట్‌తోపాటు గూగుల్‌ సంస్థలకు నోటీసులు జారీ చేసి సమాచారాన్ని క్రోడీకరించారు. హైదరాబాద్‌లోని సీఐడీ సైబర్‌ క్రైం విభాగం సహకారం తీసుకున్నారు.

తమీం సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కావడంతో పోలీసులకు దొరక్కుండా జాగ్రత్త పడ్డాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిన సీఐ సుమారు రెండు నెలలపాటు ఈ కేసుపై దృష్టి సారించి చివరికి తమీంను నిందితుడిగా గుర్తించారు. పక్కా సమాచారంతో సోమవారం ఉదయం అతడు ఇంటివద్ద ఉండగా అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తమదైన శైలిలో విచారణ మొదలుపెట్టగానే తమీం నిజం ఒప్పుకున్నాడు. అతడు వినియోగించిన ల్యాప్‌టాప్, మొబైల్‌ఫోన్‌, డాటాకార్డ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమీంను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
In a bid to take revenge on his in-laws, 35-year-old Azar Mohinuddin Thamim, a database administrator with IBM, Hyderabad, landed in trouble. A native of Mukarampura of Karimnagar town, Azar got married to a woman from the same town in 2013. Troubles cropped up among the couple as he had extra-marital affairs and used to harass his wife for additional dowry. On June 20, 2017, the lady lodged a complaint with women police station as Azar sent her to maternal home. Enraged over the incident, he developed a grudge on his in-laws family and decided to take revenge.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి