టెక్కీ కిరాతకం: భార్యను చంపేసి ముక్కలు చేసి తగులబెట్టాడు (ఫొటోలు)

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: హైదరాబాద్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తన భార్యను కిరాతకంగా చంపేసి, శవాన్ని ముక్కలుగా కోసి సూట్‌కేసులో పెట్టి పెట్రోలు పోసి తగులబెట్టాడు. అతన్ని రూపేష్‌‌గా గుర్తించారు. నిప్పటించిన తర్వాత తిరిగి వెళ్తుండగా, కారు బురదలో కూరుకుపోయింది. దీంతో అతను స్థానికులకు చిక్కాడు.

స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. రూపేష్ తల్లిదండ్రులు పద్మానగర్‌లో నివాసం ఉంటారు. సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ పడ్డారు. ఆ సమయంలో భార్య సిందియాను అతను హత్య చేసి, శవాన్ని ముక్కలుగా కోసి సూట్‌కేసులో పెట్టాడు.

సోమవారం ఉదయం ఎనిమిదేళ్ల పాపను స్కూలుకు పంపించాడు. సాయంత్రం పాపను తీసుకుని వచ్చి, సూట్‌కేసును కారులో పెట్టుకుని కూతురితో పాటు శంషాబాద్ మండలం మదనపల్లికి వచ్చాడు. అక్కడ నిర్మానుష్యమైన ప్రదేశంలో సూట్‌కేసును తగులబెట్టాడు.

అక్కడ క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానంతో స్థానికులు చేరుకున్నారు. వారిని చూసి కారులో పారిపోవడానికి రూపేష్ ప్రయత్నించాడు. అయితే, అతను కూతురితో కారులో పారిపోవడానికి ప్రయత్నించాడు. కారు బురదలో కూరుకుపోవడంతో స్థానికలకు చిక్కాడు.

స్థానికులు పట్టుకున్న సమయంలో కూతురు కూడా అతనితో పాటు ఉన్నాడు. షేర్ మార్కెట్లో వచ్చిన నష్టం వల్ల భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు భావిస్తున్నారు. రూపేష్ 1990 ప్రాంతంలో ఆఫ్రికా వెళ్లి వ్యాపారం చేశాడని తెలుస్తోంది. 2008లో సిందియా అనే డ్యాన్సర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు 2012లో భార్యాభర్తలు హైదరాబాద్ వచ్చారు.

కూతురితో పాటు మాదాపూర్ సైబర్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్నారు. ఈ నివాసంలోనే భార్యను రూపేష్ హత్య చేసినట్లు తెలుస్తోంది. కూతురికి ఆ విషయం తెలియకుండా రూపేష్ జాగ్రత్త పడ్డాడు. భార్య వద్దని చెప్పినా రూపేష్ షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతూ వచ్చాడు. దాంట్లో అతనికి విపరీతమైన నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

రూపేష్‌ను, అతని పాపను పోలీసులు విడివిడిగా విచారిస్తున్నారు. రూపేష్ నివాసంలో కూడా పోలీసులు సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది.

ఆ టెక్కీ ఇతనే...

ఆ టెక్కీ ఇతనే...

భార్యను అత్యంత కిరాతకంగా చంపి, శవాన్ని ముక్కలు చేసి సూట్‌కేసులో కుక్కి తగులబెట్టడానికి ప్రయత్నించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఇతనే....

ఇలా తగులబెట్టాడు...

ఇలా తగులబెట్టాడు...

భార్య శవాన్ని సూట్‌కేసులో పెట్టి శంషాబాద్ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో పెట్రోల్ పోసి ఇలా తగులబెట్టాడు.

బురదలో కూరుకుపోయిన కారు...

బురదలో కూరుకుపోయిన కారు...

మంటలను చూసి స్థానికులు క్షుద్రపూజలు జరుగుతున్నాయనే అనుమానంతో వచ్చారు. వారిని చూసి టెక్కీ పారిపోవడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో అతని కారు బురదలో కూరుకుపోయింది.

పోలీసుల విచారణ

పోలీసుల విచారణ

స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు టెక్కీని అదుపులోకి తీసుకని విచారించారు. ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది.

ఇక్కడే ఉండేవాడు...

ఇక్కడే ఉండేవాడు...

టెక్కీ తన భార్యను తన నివాసంలోనే హత్య చేశాడు. అతని నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. చిన్నారి కూతురుకు తెలియకుండా భార్యను చంపేశాడు.

దిక్కు కోల్పోయిన చిన్నారి.

దిక్కు కోల్పోయిన చిన్నారి.

అమ్మేదీ అని అడిగితే బంధువుల ఇంటికి వెళ్లిందని కూతురిని నమ్మించడానికి టెక్కీ ప్రయత్నించాడు. ఇప్పుడు ఎనిమిదేళ్ల కూతురు తల్లి లేని బడ్డయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A techie has killed his wife, chopped into pieces and burnt at Shamshabad near Hyderabad. The Techie Rupesh has been nabbed by police.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి