టెక్కీ ఘాతుకం: 15 సార్లు కత్తితో పొడిచి భార్యను చంపాడు
హైదరాబాదులో ఓ టెక్కీ తన భార్యను 15 సార్లు కత్తితో పొడిచి చంపాడు. అతని పోలీసులు శుక్రవారంనాడు అరెస్టు చేశారు.
హైదరాబాద్: ఓ టెక్కీ హైదరాబాదులో అత్యంత ఘాతుకమైన చర్యకు ఒడిగట్టాడు. బ్యాంక్ ఆఫ్ ఆమెరికాలో పనిచేస్తున్న అతను భార్యను దుమ్మాయిగుడాలోని తన నివాసంలో గురువారం చంపేశాడు. అతని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అయిన చక్రపాణి బ్యాంక్ ఆఫ్ అమెరికాలో పనిచేస్తున్నాడు. తన 34 ఏళ్ల భార్య మాధవిని తన నివాసంలో 15 సార్లు కత్తితో పొడిచిచంపాడు. ఆ తర్వాత అతను జవహర్‌నగర్‌లోని పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు.

అతను హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని, రక్తం మరకలు అంటిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకుని అతన్ని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు అతనికి జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.
పుట్టింటి నుంచి ఇంటికి తీసుకుని వచ్చి అతను భార్యను చంపాడు. మద్యానికి బానిసై అతను ఈ దారుణానికి ఒడిగట్టినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications