అర్ధరాత్రి హైదరాబాద్ రోడ్లపై టెక్కీల వీరంగం
హైదరాబాద్: కొందరు సాఫ్టువేర్ ఇంజనీర్‌లు ఆదివారం అర్ధరాత్రి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో వీరంగం సృష్టించారు. బాగా మందుకొట్టి వారు హంగామా చేశారు. క్యాబ్ విషయంలో టెక్కీలు గొడవ పడ్డారు. పోలీసులకు సమాచారం అందడంతో వారు వచ్చి అదుపులోకి తీసుకున్నారు.
భార్యను చంపిన భర్త
హైదరాబాదులోని రామంతూపూర్‌లో దంపతుల మధ్య జరిగిన ఘర్షణలో భార్య మృతి చెందింది. పోలీసులు నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నారు.
దుకాణాలపై దూసుకెళ్లిన లారీ: ఒకరు మృతి

నిజామాబాద్ జిల్లాలోని పిట్లం మండలం చిన్న కొడప్‌గల్లులో ఓ లారీ ప్రమాదవశాత్తు దుకాణాల పైకి దూసుకెళ్లింది. సోమవారం జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతిచెందారు. రెండు దుకాణాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
సవతి తల్లి చేతిలో బాలుడి హత్య
అదిలాబాద్ జిల్లాలో సవతి తల్లి చేతిలో ఓ బాలుడు హత్యకు గురయ్యాడు. రెబ్బెనకు చెందిన పిట్టల ప్రభాకర్‌కు మొదటి భార్య ద్వారా ఆరేళ్ల వయసున్న కుమారుడు జయసూర్య ఉన్నాడు. మొదటి భార్య మృతి చెందడంతో ఆరు నెలల క్రితం ప్రభాకర్ సునీతను రెండో వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో తనకు పుట్టబోయే పిల్లలకు జయసూర్య అడ్డుగా ఉంటాడని భావించిన సునీత, అతడిని అంతమొందించేందుకు నిర్ణయించుకుంది.
ఈ నెల 16న భర్త మంచిర్యాలకు వెళ్లాడు. భర్త తల్లి ఉపాధి హామీ పనులకు వెళ్లింది. ఇదే అదనుగా భావించిన సునీత జయసూర్యను గొంతు నులిమి చంపేసింది. అనంతరం బాత్‌రూంలో జారి పడి మృతి చెందాడని అందరినీ నమ్మించింది.
అంత్యక్రియల అనంతరం సునీత ప్రవర్తనలో మార్పు రావడంతో అనుమానం వచ్చిన ప్రభాకర్ శనివారం ఆమెను నిలదీయడంతో జయసూర్యను తానే హత్య చేశానని సునీత ఒప్పుకుంది. దీంతో ప్రభాకర్, సునీతపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. బాలుడి గొంతుపై గట్టిగా నులిమినట్లు గుర్తులు, గాయాలు ఉన్నాయని చెప్పారు.
-
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
కర్ణాటక టూర్ వెళ్లొద్దామా..? తక్కువ ధరకే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్ లో ఎంజాయ్..! -
రైతు భరోసా రెండో విడత నిధుల జమ షెడ్యూల్ ఖరారు, ఈ సారి వీరికే..!! -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ??












Click it and Unblock the Notifications