కంప్యూటర్లలో సాంకేతిక సమస్య: హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ పరీక్షలో గందరగోళం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో పరీక్ష నిర్వహణలో గందరగోళంగా మారింది. సోమవారం సాయంత్రం జరగాల్సిన హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ పరీక్షను సాంకేతిక సమస్యల కారణంగా కొందరు అభ్యర్థులు రాయలేకపోయారు. హైదరాబాద్ మల్లాపూర్‌లోని ఐయాన్ డిజిటల్‌లో సాయంత్రం 4.45 గంటలకు మొదలైన పరీక్షలో.. దాదాపు ఐదుగురు అభ్యర్థుల కంప్యూటర్స్ ఓపెన్ కాలేదు.
టెక్నికల్ సమస్యలు తలెత్తడంతో కంప్యూటర్లు ఓపెన్ కాలేదని ఎగ్జామ్ సెంటర్ అధికారులు తెలిపారు. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.
అయితే, ఈ విషయంపై ఎగ్జామ్ అధికారులు తీసుకున్న నిర్ణయం అభ్యర్థులకు మరింత ఆగ్రహానికి గురిచేసింది.

అధికారులు ఆ ఐదుగురు అభ్యర్థులకు టైమ్ ఇచ్చి పరీక్ష నిర్వహించడమో లేక ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం లాంటి నిర్ణయాలు తీసుకోకుండా... అభ్యర్థులందరినీ 2.30 గంటల పాటు ఎగ్జామ్ హాల్లో ఉంచారు. ఎగ్జామ్ సెంటర్ గేట్లకు తాళం వేసి నిర్భంధించారు.
ఈ సమస్య వల్ల ఎవరికీ ఎగ్జామ్ నిర్వహించకపోయినా.. అభ్యర్థులందరినీ రెండున్నర గంటల పాటు ఎందుకు నిర్భంధించారో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో అభ్యర్థులంతా ఎగ్జామ్ సెంటర్ నుంచి బయటికి వచ్చి సెంటర్ ముందు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ శారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి అభ్యర్థుల ఆందోళన విరమింపజేసే ప్రయత్నం చేశారు. ఆందోళన విరమించకపోవడంతో అభ్యర్థులను అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ వివాదంపై ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది.












Click it and Unblock the Notifications