ఇండిగో విమానంలో సాంకేతిక లోపం: 5 గంటలుగా శంషాబాద్ విమానాశ్రయంలోనే
హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయంలో ఓ విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో విమానాశ్రయంలోనే కొద్ది గంటలుగా విమానం నిలిచిపోయింది. దాదాపు ఐదు గంటలుగా విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమను వేరే విమానంలో అయినా పంపించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ విమానాశ్రయంలో ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానాన్ని విమానాశ్రయంలోనే నిలిపివేశారు. దాదాపు 5 గంటలుగా ప్రయాణికులు విమానంలోనే ఉండిపోయారు. ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురుకాకుండా విమాన సిబ్బంది చర్యలు చేపట్టారు.

ఆదివారం ఉదయం 11 గంటలకు ఇండిగో విమానం ఢిల్లీ వెళ్లాల్సి ఉండగా.. 5 గంటలకుపైగా ఆలస్యమైంది. సాంకేతిక లోపం తలెత్తినా వెంటనే స్పందించకపోవడంపై విమాన సిబ్బంది, అధికారులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో విమానం ఏర్పాటు చేసే తమను గమ్యస్థానం చేర్చాలని డిమాండ్ చేశారు.
అయితే, మరో విమానం ఏర్పాటు చేయకుండా తమను గంటలకొద్ది ఎదురుచూసేలా చేసిన విమాన యాజమాన్యంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. చిన్నారులతో తాము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నామని వాపోయారు. వెంటనే మరో విమానం ఏర్పాటు చేసి తమను గమ్యస్థానం చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. విమాన యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications