ట్విస్ట్‌: బర్త్‌డే అంటూ సుధాకర్‌రెడ్డి శవాన్ని ఇలా, కారు డ్రైవరంటూ రాజేష్‌ అలా..

నాగర్‌కర్నూల్: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన స్వాతి తెల్లవారిన తర్వాతే ఇరుగు పొరుగు వారికి తెలియకుండా కారులో శవాన్ని తీసుకెళ్ళింది.కారును ఇంటి డోర్ వద్దకు తీసుకెళ్ళి డిక్కీలో సుధాకర్ రెడ్డి మృతదేహన్ని కారులో ఎక్కించారు.

అచ్చు క్రైమ్ సినిమాను తలపించే రీతిలో స్వాతి, ఆమె ప్రియుడు రాజేష్ సుధాకర్‌రెడ్డిని హత్య చేశారు. అంతేకాదు సుధాకర్ రెడ్డి రూపంలోనే ప్రియుడు రాజేష్‌తో కాపురం చేయాలని స్వాతి భావించింది.

Recommended Video

    స్వాతి భర్తను చంపడానికి కారణాలు ! అసహ్యం వేస్తోంది | Oneindia Telugu

    అయితే రాజేష్ వేలి ముద్రల ఆధారంగా అసలు విషయం వెలుగు చూసింది. మరో వైపు వివాహేతర సంబంధం కారణంగా పచ్చని కాపురంలో స్వాతి నిప్పులు పోసుకొంది.

    ఇంటి డోర్ వద్దకు కారును తీసుకెళ్ళి

    ఇంటి డోర్ వద్దకు కారును తీసుకెళ్ళి

    నవంబర్ 27వ, తేది తెల్లవారుజామున పడుకొన్న సుధాకర్‌రెడ్డికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి మత్తులోకి జారుకొన్న వెంటనే అతడి తలపై ఇనుప రాడ్‌తో బాది హత్య చేశారు రాజేష్, స్వాతి. అయితే మృతదేహన్ని ఎవరి కంటపడకుండా బయటకు తీసుకెళ్ళేందుకు చాలానే కష్టపడ్డారు.

    రాజేష్ కారును సుధాకర్ రెడ్డి అద్దెకు ఉంటున్న ఇంటివద్దకు తీసుకువచ్చాడు. అయితే కారును ఇంటి డోర్ వద్దకు తీసుకెళ్ళాడు. సుధాకర్ రెడ్డి ఎప్పుడు గేటు బయటే కారును పార్కింగ్ చేసేవాడు.అయితే కారును డోర్ వద్దకు తీసుకెళ్ళిన సమయంలో ఇంటి ఓనర్ స్వాతిని కారు ఎందుకు ఇంట్లోకి తీసుకువచ్చారని అడిగింది. అయితే ఊరెళ్తున్నామని స్వాతి చెప్పింది. లగేజీ పెట్టడానికి కారును లోనికి తీసుకువచ్చినట్టు చెప్పింది. అయితే అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న మరో మహిళ కూడ కారు లోపలికి రావడంపై అనుమానం వచ్చింది. అయితే ఆ సమయంలో స్వాతి టెన్షన్‌గా ఉందని స్థానికులు చెప్పారు.

    రాజేష్‌ను కారు డ్రైవర్‌ గా నమ్మించిన స్వాతి

    రాజేష్‌ను కారు డ్రైవర్‌ గా నమ్మించిన స్వాతి


    రాజేష్‌ను కారు డ్రైవర్ అంటూ ఇరుగు పొరుగు వారికి చెప్పింది స్వాతి. ఇంటి యజమానురాలికి ఓ రకంగా సమాధానమిచ్చింది స్వాతి. మరో వైపు అదే ఇంట్లో అద్దెకు ఉంటున్న మరో మహిళ కారు ఇంట్లోకి రావడంతో బయటకు వచ్చి స్వాతిని అడిగింది. సుధాకర్‌రెడ్డిని బయటకు తీసుకెళ్ళడానికి కారును కావాలని అడిగితే తన సోదరుడు డ్రైవర్‌ను ఇచ్చి కారును పంపాడని స్వాతి నమ్మించింది. ఇద్దరిని నమ్మించి ఉదయం ఆరున్నర గంటల సమయంలో ఇంట్లో నుండి దుప్పట్లో సుధాకర్ రెడ్డి శవాన్ని తీసుకొని పర్వతాపూర్ అడవుల్లోకి తీసుకెళ్ళి పెట్రోల్ పోసి తగులబెట్టారు.

    రాజేష్ చూడడం అదే తొలిసారి

    రాజేష్ చూడడం అదే తొలిసారి


    రాజేష్‌తో స్వాతికి దాదాపుగా రెండున్నర ఏళ్ళుగా వివాహేతర సంబంధం కొనసాగుతోందని పోలీసులు చెబుతున్నారు. అయితే ఏనాడూ కూడ సుధాకర్ రెడ్డి అద్దెకు ఉన్న ప్రాంతానికి రాజేష్ రాలేదని ఇరుగు పొరుగు వారు చెబుతున్నారు. సుధాకర్‌రెడ్డిని చంపిన రోజే తొలిసారిగా రాజేష్‌ను ఇంటి యజమాని భార్య, మరో మహిళ చూశారని స్థానికులు చెబుతున్నారు. అయితే స్వాతి స్టోరీ వెలుగు చూసిన తర్వాత మీడియాలో వచ్చిన ఫోటోలను బట్టి రాజేష్‌ను వారు పోల్చుకొన్నారు

    నా బిడ్డ చనిపోయిందనుకొంటున్నా

    నా బిడ్డ చనిపోయిందనుకొంటున్నా

    సుధాకర్‌రెడ్డిని తన కూతురే హత్య చేసిందనే విషయాన్ని తెలుసుకొని స్వాతి తల్లి దండ్రులు కూడ తట్టుకోలేకపోతున్నారు. తన కూతురునే తనకు అప్పగిస్తే తానే హత్య చేస్తానని స్వాతి తల్లి ఆవేశంగా చెబుతోంది. స్వాతి ఏం దాచుకోదని వాగుడుకాయ అంటూ తనతో సుధాకర్ రెడ్డి అనేవాడని, కానీ, స్వాతి మంచిదని, వాగుడు తగ్గించుకోవాలని మీరైనా సలహ ఇవ్వాలని సుధాకర్ రెడ్డి తనతో చెప్పేవారని స్వాతి తల్లి చెబుతున్నారు.

    మరో వైపు సుధాకర్ రెడ్డి. స్వాతిని తనకు అప్పగిస్తే చంపేస్తానని స్వాతి తల్లి ఆవేశంగా చెబుతున్నారు. తన కూతురు చనిపోయిందని అనుకొంటున్నామని, సుధాకర్ రెడ్డిని చంపినత తర్వాత తన కూతురితో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్వాతి తండ్రి చెబుతున్నారు.

    సుధాకర్ రెడ్డి చాలా మంచోడు

    సుధాకర్ రెడ్డి చాలా మంచోడు

    తాను పుట్టిన ఊరు బాగుపడాలని సుధాకర్ రెడ్డి కోరుకోనేవాడని ఆయన స్నేహితులు గుర్తు చేస్తున్నారు. సుధాకర్ రెడ్డి లాంటి మంచి స్నేహితుడిని కోల్పోవడం పట్ల వారు తట్టుకోలేకపోతున్నారు.ఎవరికీ కూడ ఎలాంటి హనీ తలపెట్టని వ్యక్తిత్వం సుధాకర్ రెడ్డిదని వారు గుర్తు చేస్తున్నారు.సుధాకర్ రెడ్డి దేవుడు లాంటి వాడని ఆయన ప్రాణ స్నేహితుడు మీడియాతో చెప్పుకొంటూ కన్నీరు పెట్టుకొన్నారు.

    చనిపోయిందెవరంటూ రాజేష్ బంధువుల ప్రశ్న

    చనిపోయిందెవరంటూ రాజేష్ బంధువుల ప్రశ్న

    15 రోజులుగా తమను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారని రాజేష్ కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుధాకర్ రెడ్డి చనిపోయాడని చెబుతున్నారని, రాజేష్ చంపేశారా అని కూడ వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజేష్‌ను తమకు చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమ కుటుంబాన్ని టార్చర్ పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+