Telangana: గుండెపోటుతో పదేళ్ల బాలిక మృతి..
ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు ఎక్కువయిపోయాయి. ఆడుతూ.. పాడుతూ ఉండాల్సిన చిన్నారులు గుండెపోటుకు గురయి మృత్యువాత పడుతున్నారు. కళ్లేదుట అల్లరి చేస్తూ తిరిగిన చిన్నారులు కూడా గుండెపోటుతో మృతిచెందుతున్నారు. తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో మొన్నే చిన్నారి నివృత గుండెపోటుతో మృతిచెందింది. ఆ ఘటన ఇంకా కళ్లముందు మెదలాడుతూనే ఉంది. అంతలోనే మరో ఘటన ఆ గ్రామస్థులను శోకసంద్రంలో ముంచెత్తింది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామానికి చెందిన పది సంవత్సరాల బాలిక సమన్విత గుండెపోటుతో మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే.. ఎప్పటిలాగే ఉదయం స్కూల్ కు వెళ్లేందుకు రెడీ అవుతున్ సమన్విత ఒక్కసారిగా ఉన్నట్టుండి కుప్పకూలిపోయింది. ఆ విషయాన్ని గుర్తించిన తండ్రి నాగరాజు హుటాహుటిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించినా ఆ చిన్నారి ప్రాణాలను మాత్రం కాపాడలేకపోయారు. మధ్యాహ్నం గుండెపోటుతో చిన్నారి మృతిచెందిందని డాక్టర్లు నిర్థారించారు. చిన్నారి సమన్విత మరణంతో ఆ తల్లిగుండె తట్టుకోలేక పోయింది. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కళ్లముందే కుప్పకూలుతున్నారు..
సమన్విత లక్షేట్టిపేట మండలం కేంద్రంలోని కృష్ణవేణి హై స్కూల్ లో నాలుగో తరగతి చదువుతుంది. రెండు వారాల క్రితం ఇదే జిల్లాలోని చెన్నూరు పట్టణం పద్మనగర్ కాలనీలో పన్నెండేళ్ళ కస్తూరి నివృతి గుండెపోటుతో మృతి చెందింది. ఈ విషాద సంఘటన మరవకముందే సమన్విత మృతితో మంచిర్యాల జిల్లా స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న పెంచుకున్న తమ చిన్నారులు కళ్లముందే కుప్పకూలిపోయి, కన్నవారికి కడుపుకోత మిగుల్చుతున్నారు.












Click it and Unblock the Notifications