Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కల్లోల తెలంగాణ: కేసుల్లో ఉధృతితో బేజార్: యాక్టివ్ కేసుల్లో కొత్త నంబర్

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ తీవ్రత తగ్గుముఖం పట్టట్లేదు. దాని ఉధృతి కొనసాగుతూనే వస్తోంది. రోజువారీ కరోనా వైద్య పరీక్షలకు అనుగుణంగా కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త కేసులు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఒకవంక డిశ్చార్జిల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. రోజువారీ కొత్త కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో ఆందోళనలు వ్యక్తమౌతున్నాయి. యాక్టివ్ కేసులు ఇప్పటికే 30 వేలను దాటేశాయి. తాజాగా 32 వేలకు చేరుకున్నాయి. రోజువారీ మరణాల సంఖ్య 10కి కాస్త అటు, ఇటుగా నమోదవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో కరోనా కేసుల్లో స్వల్పంగా మార్పులు ఉంటున్నాయే తప్ప పూర్తిగా తగ్గుముఖం పట్టట్లేదు.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 2574 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిదిమంది మరణించారు. 2974 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఇళ్లకు వెళ్లిపోయారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,40,969కి చేరుకుంది. ఇందులో 1,07,530 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 886కు చేరుకుంది. యాక్టివ్ కేసుల సంఖ్య 32,553గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 25,449 మంది చికిత్స పొందుతున్నారు.

Telangana: 2574 Covid19 positive cases and 9 deaths reported in last 24 hours

గ్రేటర్ హైదరాబాద్‌లో 24 గంటల్లో కొత్తగా 325 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. ఆదిలాబాద్-22, భద్రాద్రి కొత్తగూడెం-69, జగిత్యాల-81, జనగామ-39, జయశంకర్ భూపాలపల్లి-24, జోగుళాంబ గద్వాల-21, కామారెడ్డి-86, కరీంనగర్-144, ఖమ్మం-128, కొమరంభీమ్ ఆసిఫాబాద్-25, మహబూబ్ నగర్-44, మహబూబాబాద్-73, మంచిర్యాల-63, మెదక్-34, మేడ్చల్ మల్కాజ్‌గిరి-185, ములుగు-15, నాగర్ కర్నూలు-51, నల్లగొండ-158, నారాయణపేట్-11, నిర్మల్-19, నిజామాబాద్-95, పెద్దపల్లి-69, రాజన్న సిరిసిల్ల-45, రంగారెడ్డి-197, సంగారెడ్డి-82, సిద్ధిపేట్-88, సూర్యాపేట్-102, వికారాబాాద్-14, వనపర్తి-41, వరంగల్ రూరల్-40, వరంగల్ అర్బన్-117, యాదాద్రి భువనగిరి-67 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    Teachers Day 2020 As Black Day : టీచర్స్ డే ను బ్లాక్ డేగా ప్రకటించిన ఉపాధ్యాయులు!!

    కరోనా వైరస్ పరీక్షలు జోరుగా కొనసాగుతున్నాయి. మరోసారి 60 వేల వరకు టెస్టులను నిర్వహించారు. కొత్తగా వ్యాప్తంగా 62,736 శాంపిళ్లను పరీక్షించినట్లు తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 17,30,389కి చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 46,608 పరీక్షలను నిర్వహించిన్నట్లు అధికారులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+