తెలంగాణలో కరోనా కేసుల కొత్త వెల్లువ: ఒక్కరోజే మూడువేలకు పైగా: పీక్స్‌లో టెస్టులు

హైదరాబాద్: తెలంగాణలో కరోనా వైరస్ ఒక్కసారిగా విజృంభించింది. ఇదివరకు ఎప్పుడూ లేని స్థాయిలో కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 24 గంటల వ్యవధిలో కొత్తగా మూడువేలకు పైగా పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. ఒక్కరోజులో మూడువేల మార్క్‌ కంటే అధికంగా కరోనా కేసులు నమోదు కావడం తెలంగాణలో ఇదే తొలిసారి. గ్రేటర్ హైదరాబాద్ సహా రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మంచిర్యాల, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ అర్బన్, నల్లగొండ జిల్లాల్లో కరోనా కల్లోలాన్ని రేపుతోంది. ఆయా జిల్లాల్లో అత్యదిక కేసులు నమోదు అయ్యాయి.

24 గంటల్లో మూడు వేలకు పైగా

24 గంటల్లో మూడు వేలకు పైగా

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో 3018 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 10 మంది మరణించారు. 1060 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకున్నారు. దీనితో ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1,11,688కి చేరుకుంది. ఇందులో 85,223 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వల్ల మరణించిన వారి సంఖ్య 780కి చేరుకుంది. మొత్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 25,685గా నమోదైంది. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 19,113 మంది చికిత్స పొందుతున్నారు.

గ్రేటర్‌తో జత కట్టిన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి

గ్రేటర్‌తో జత కట్టిన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ పరిధిలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ మొదటికి వచ్చాయి. కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టినట్టు కనిపించినప్పటికీ.. 24 గంటల్లో కొత్తగా 475 పాజిటివ్ కేసులు రికార్డు అయ్యాయి. జీహెచ్ఎంసీకి ఆనుకుని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లో రెండు వందలకు పైగా నమోదు అయ్యాయి. కరీంనగర్, ఖమ్మం, మంచిర్యాల, నల్లగొండ, వరంగల్ అర్బన్, జగిత్యాల జిల్లాల్లో వందకు పైగా కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు తమ కొద్దిసేపటి కిందటే విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నారు.

జిల్లాలవారీగా లెక్కలివే..

జిల్లాలవారీగా లెక్కలివే..

24 గంటల్లో కొత్తగా ఆదిలాబాద్-28, భద్రాద్రి కొత్తగూడెం-95, జగిత్యాల-100, జనగామ-52, జయశంకర్ భూపాలపల్లి-20, జోగుళాంబ గద్వాల-37, కామారెడ్డి-76, కరీంనగర్-127, ఖమ్మం-161, కొమరంభీమ్ ఆసిఫాబాద్-11, మహబూబ్ నగర్-56, మహబూబాబాద్-60, మంచిర్యాల-103, మెదక్-40, మేడ్చల్ మల్కాజ్‌గిరి-204, ములుగు-26, నాగర్ కర్నూలు-38, నల్లగొండ-190, నారాయణపేట్-14, నిర్మల్-41, నిజామాబాద్-136, పెద్దపల్లి-85, రాజన్న సిరిసిల్ల-69, రంగారెడ్డి-247, సంగారెడ్డి-61, సిద్ధిపేట్-88, సూర్యాపేట్-67, వికారాబాాద్-21, వనపర్తి-46, వరంగల్ రూరల్-61, వరంగల్ అర్బన్-139, యాదాద్రి భువనగిరి-44 కేసులు నమోదు అయ్యాయి.

Recommended Video

    RGV 'మర్డర్' సినిమా కి ఝలక్ .. రిలీజ్ వాయిదా | Ram Gopal Varma | Oneindia Telugu
     61 వేలకు పైగా టెస్టులు

    61 వేలకు పైగా టెస్టులు

    ప్రాణాంతక కరోనా వైరస్ పరీక్షలను నిర్వహించడంలో తెలంగాణ ప్రభుత్వం తన దూకుడును కొనసాగిస్తోంది. మంగళవారం నాటి బులెటిన్ ప్రకారం.. 24 గంటల వ్యవధిలో మొత్తం 52,933 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు.. మరుసటి రోజు నాటికి 60 వేలకు పైగా కరోనా టెస్టులను నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా 61,040 శాంపిళ్లను పరీక్షించినట్లు బుధవారం నాటి తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇప్పటిదాకా పరీక్షించిన శాంపిళ్ల సంఖ్య 10,82,094కు చేరుకుంది. ఆర్టీ-పీసీఆర్/సీబీనాట్/ట్రూనాట్, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్టింగ్ కేంద్రాల ద్వారా పరీక్షలను నిర్వహిస్తున్నారు. ప్రతి 10 లక్షలమంది జనాభాకు సగటున 29,146 పరీక్షలను నిర్వహించిన్నట్లు అధికారులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+