ఏడుపాయల కలకలం: తెలంగాణలో లేటెస్ట్ కరోనా రిపోర్ట్: జిల్లాలవారీగా లెక్కలివే

హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మరోసారి రెక్కలు విరుచుకుంటోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. తమ చుట్టూ కరోనా వైరస్ వ్యాప్తి చెంది ఉందనే విషయాన్ని ప్రజలు విస్మరిస్తున్నారని, ముందు జాగ్రత్త చర్యలను పాటించకపోవడం వల్లే ఈ మహమ్మారి మరోసారి విజృంభిస్తోందనే అభిప్రాయం అధికార వర్గాల్లో నెలకొంది. కరోనా వైరస్ కొనసాగినన్ని రోజులు మాస్క్‌లను ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం వంటి చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తోన్నారు. తాజాగా- ఏడుపాయల వనదుర్గ అమ్మవారి ఆలయం కార్యనిర్వహణాధికారికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది.

కొత్తగా 313 కరోనా కేసులు..

కొత్తగా 313 కరోనా కేసులు..

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 313 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇద్దరు మరణించారు. 142 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,02,360కి చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 2,98,262 మంది ఉన్నారు. 1,664 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు క్రమంగా పెరుగుదల బాట పట్టాయి. తాజా బులెటిన్ ప్రకారం.. 2,434 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 943 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

గ్రేటర్‌లోనే అధికం..

గ్రేటర్‌లోనే అధికం..

గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో కొత్తగా 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇదివరకటి రోజువారీ కేసులతో పోల్చుకుంటే ఈ సంఖ్య తక్కువే. అయినప్పటికీ.. క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒక్క నారాయణపేట్ తప్ప అన్ని జిల్లాల్లోనూ కొత్త కేసులు నమోదు కావడం కరోనా తీవ్రతకు అద్దం పడుతోంది. లాక్‌డౌన్ తరహా పరిస్థితులను నివారించడానికి ప్రజలు ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవడం ఒక్కటే మార్గమని అధికారులు స్పష్టం చేస్తోన్నారు.

జిల్లాలవారీగా లెక్కలివీ..

జిల్లాలవారీగా లెక్కలివీ..

జిల్లాలవారీగా ఆదిలాబాద్-10, భద్రాద్రి కొత్తగూడెం-3, జగిత్యాల-8, జనగామ-5, జయశంకర్ భూపాలపల్లి-1, జోగుళాంబ గద్వాల-4, కామారెడ్డి-16, కరీంనగర్-9, ఖమ్మం-8, కొమరంభీమ్ ఆసిఫాబాద్-5, మహబూబ్‌నగర్-9, మహబూబాబాద్-5, మంచిర్యాల-10, మెదక్-1, మేడ్చల్ మల్కాజ్‌గిరి-20, ములుగు-2, నాగర్ కర్నూల్-1, నల్లగొండ-8, నిర్మల్-25, నిజామాబాద్-15, పెద్దపల్లి-3, రాజన్న సిరిసిల్ల-12, రంగారెడ్డి-29, సంగారెడ్డి-13, సిద్ధిపేట్-8, సూర్యాపేట్-7, వికారాబాాద్-8, వనపర్తి-3, వరంగల్ రూరల్-2, వరంగల్ అర్బన్-8, యాదాద్రి భువనగిరి-8 కేసులు నమోదు అయ్యాయి. నారాయణపేట్ జిల్లాలో కొత్తగా ఒక్క కేసూ నమోదు కాలేదు.

95 లక్షలకు చేరువగా టెస్టింగులు..

95 లక్షలకు చేరువగా టెస్టింగులు..

తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 62,972 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షలు 57,488 కాగా.. మిగిలినవీ ప్రైవేటు హాస్పిటల్స్‌లో నమోదయ్యాయి. కొత్త వాటితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 94,82,649గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 2,54,772 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.

ఏడు పాయల కలకలం..

ఏడు పాయల కలకలం..

కాగా- మెదక్ జిల్లాలోని ప్రఖ్యాత ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాస్‌కు కరోనా వైరస్ సోకడం ఆందోళనకు దారి తీస్తోంది. దీనితో వారం రోజుల పాటు ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అమ్మవారికి నిత్య కైంకర్యాలు యధాతథంగా కొనసాగుతాయని చెప్పారు. 25వ తేదీ వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. కొద్దిరోజుల కిందటే అమ్మవారి వార్షిక ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు కరోనా సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+