తెలంగాణలో రోజురోజుకూ కొత్త కేసుల పెరుగుదల: గ్రేటర్ హైదరాబాద్‌లో సెంచరీ మార్క్
హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకూ కరోనా వైరస్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. రోజువారీ కేసుల సంఖ్య క్రమం తప్పకుండా ఎగబాకుతోంది. పదుల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. అధికార యంత్రాంగాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. ఈ పరిణామాల మధ్య పాఠశాలలను మూసివేయాలనే అంశాన్ని కేసీఆర్ సర్కార్ పరిశీలిస్తోంది. రోజువారీ కేసుల పెరుగుదల ఇదే తరహాలో కొనసాగితే.. రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లను మూసివేసే దిశగా నిర్ణయాలన్ని తీసుకునే అవకాశాలు లేకపోలేదు. 10వ తరగతి లోపు పాఠశాలలు, గురుకులాలు వసతిగృహాలను మూసివేయొచ్చని సమాచారం.
తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 412 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ముగ్గురు మరణించారు. 216 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3,03,867కు చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 2,99,042 మంది ఉన్నారు. 1,674 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసులు మూడువేలను దాటేశాయి. తాజా బులెటిన్ ప్రకారం.. 3,151 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. గృహాలు, ఇన్‌స్టిట్యూషనల్ ఐసొలేషన్‌లో 1,258 మంది చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొత్తగా నమోదైన కేసుల సంఖ్య సెంచరీ దాటింది. గ్రేటర్‌లో కొత్తగా 103 కేసులు నమోదయ్యాయి. ఈ మధ్యకాలంలో ఈ రోజువారీ కేసుల సంఖ్య వంద దాటడం ఇదే తొలిసారి. ఆదిలాబాద్-10, భద్రాద్రి కొత్తగూడెం-6, జగిత్యాల-9, జనగామ-7, జయశంకర్ భూపాలపల్లి-4, జోగుళాంబ గద్వాల-2, కామారెడ్డి-10, కరీంనగర్-12, ఖమ్మం-11, కొమరం భీమ్ ఆసిఫాబాద్-5, మహబూబ్‌నగర్-9, మహబూబాబాద్-3, మంచిర్యాల-9, మెదక్-6, మేడ్చల్ మల్కాజ్‌గిరి-31, ములుగు-4, నాగర్ కర్నూల్-7, నల్లగొండ-11, నారాయణ్‌పేట్-1, నిర్మల్-32, నిజామాబాద్-18, పెద్దపల్లి-7, రాజన్న సిరిసిల్ల-4, రంగారెడ్డి-27, సంగారెడ్డి-8, సిద్ధిపేట్-8, సూర్యాపేట్-8, వికారాబాాద్-7, వనపర్తి-7, వరంగల్ రూరల్-4, వరంగల్ అర్బన్-12, యాదాద్రి భువనగిరి-10 కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 68,171 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షలు 61,413 కాగా.. మిగిలినవీ ప్రైవేటు హాస్పిటల్స్‌లో నమోదయ్యాయి. కొత్త వాటితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 97,18,833గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 2,61,118 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications