Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

తెలంగాణలో బీభత్సం: ఒక్కరోజే 56 మంది మృతి: 70 వేలు దాటిన కరోనా పేషెంట్లు

హైదరాబాద్: తెలంగాణలో ప్రాణాంతక కరోనా వైరస్ ఉధృతి ఏ మాత్రం తగ్గట్లేదు. భయపెట్టేలా రోజువారీ పాజిటివ్ లెక్కలు నమోదవుతున్నాయి. జనాన్ని బెంబేలెత్తిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి ముందుజాగ్రత్తలను తీసుకుని తీరాల్సిందేననే సందేశాన్ని ఇస్తున్నాయి. కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రత రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోంది. అన్ని జిల్లాల్లోనూ ఒకే తరహా పరిస్థితులు నెలకన్నాయి. యాక్టివ్ కేసులు అసాధారణంగా పెరుగుతున్నాయి. తాజాగా బులెటిన్ ప్రకారం 70 వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 8,061 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 56 మరణించారు. 5,093 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటిదాకా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,19,966కు చేరుకుంది. ఇందులో సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని, ఇళ్లకు వెళ్లిన వారు 3,45,683 మంది ఉన్నారు. 2,150 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌గా ఉన్న కేసుల్లో ఒక్కసారిగా భారీ పెరుగుదల నమోదైంది. తాజా బులెటిన్ ప్రకారం.. 72,133 యాక్టివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్య మంత్రిత్వ శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Telangana: 8061 Covid19 positive cases and and 56 deaths reported in last 24 hours

Recommended Video

    #Corona-19 update హైద‌రాబాద్‌లో క‌రోనా భ‌యం - మూడు రోజుల్లో 4358 పాజిటివ్ కేసులు..!

    గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా తీవ్రత ఏ మాత్రం తగ్గట్లేదు. కొత్తగా 1,058 కేసులు నమోదయ్యాయి. అన్ని జిల్లాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉంటోంది. ఆదిలాబాద్-125, భద్రాద్రి కొత్తగూడెం-82, జగిత్యాల-252, జనగామ-88, జయశంకర్ భూపాలపల్లి-68, జోగుళాంబ గద్వాల-82, కామారెడ్డి-202, కరీంనగర్-275, ఖమ్మం-277, కొమరం భీమ్ ఆసిఫాబాద్-79, మహబూబ్‌నగర్-97, మహబూబాబాద్-97, మంచిర్యాల-171, మెదక్-127, మేడ్చల్ మల్కాజ్‌గిరి-673, ములుగు-47, నాగర్ కర్నూల్-188, నల్లగొండ-311, నారాయణ్‌పేట్-40, నిర్మల్-109, నిజామాబాద్-291, పెద్దపల్లి-145, రాజన్న సిరిసిల్ల-142, రంగారెడ్డి-514, సంగారెడ్డి-373, సిద్ధిపేట్-253, సూర్యాపేట్-185, వికారాబాాద్-276, వనపర్తి-146, వరంగల్ రూరల్-191, వరంగల్ అర్బన్-203, యాదాద్రి భువనగిరి-213 కేసులు నమోదు అయ్యాయి.

    తెలంగాణ వ్యాప్తంగా 24 గంటల్లో 82,270 కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించినట్లు అధికారులు తమ తాజా బులెటిన్‌లో వెల్లడించారు. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్వహించిన పరీక్షలు 66,485 కాగా.. మిగిలినవి ప్రైవేటు హాస్పిటల్స్‌లో నమోదయ్యాయి. కొత్త వాటితో ఇప్పటిదాకా నిర్వహించిన మొత్తం టెస్టింగుల సంఖ్య 1,27,48,582గా నమోదైంది. సగటున ప్రతి 10 లక్షల జనాభాకు 3,42,519 మంది శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొన్నారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+