ఓటుకు నోటు ఉత్కంఠ: గవర్నర్‌తో తెలంగాణ ఏసీబీ చీఫ్, డీజీపీ భేటీ
హైదరాబాద్: తెలుగు ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ నరసింహన్‌ను తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, తెలంగాణ రాష్ట్ర ఏసీబీ డీజీ ఏకే ఖాన్‌లు మంగళవారం మధ్యాహ్నం కలిశారు. గవర్నర్‌తో ఉన్నతాధికారులు కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మంగళవారం నాడు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉదయం డీజీపీ జేవీ రాముడు, ఇతర మంత్రులతో భేటీ అయ్యారు.
అనంతరం సబ్ కమిటీ సమావేశాన్ని రద్దు చేసుకొని అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధ, సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు పాల్గొన్నారు. తెలంగాణ టీడీపీ నేతలు గవర్నర్ అపాయింటుమెంట్ కోసం ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఉదయం ఏసీబీ డీజీ ఏకే ఖాన్, హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ భేటీ అనంతరం ఏసీబీ చీఫ్, డీజీపీలు గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.
దీంతో చంద్రబాబుకు నోటీసులు ఇచ్చే అంశంపై సమాచారం ఇచ్చేందుకు కలిశారా అనే చర్చ సాగుతోంది. సోమవారం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయినప్పుడు ఇదే రకమైన ఊహాగానాలు వినిపించాయి.
హైదరాబాదులో సెక్యూరిటీ బాధ్యత మాది: ఏపీ ప్రభుత్వంపై డీజీపీ ఫిర్యాదు
హైదరాబాదులో భద్రత కల్పించాల్సిన బాధ్యత తమదేనని తెలంగాణ డీజీపీ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులో ఏపీ పోలీసులు మోహరింపు పైన డీజీపీ అనురాగ్ శర్మ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలాగైతే మొత్త ఏపీ నేతల సెక్యూరిటీ ఉపసంహరించుకుంటామని చెప్పారు.












Click it and Unblock the Notifications