ఇంట్లో రూ. 18 కోట్లు: టిడిపి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిపై ఫిర్యాదు

హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ ప్రతినిధులు ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌కు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఎంపీటీసీ, జడ్పీటీసీలను కొనేందుకు రాజేందర్‌రెడ్డి రూ. 18 కోట్లు తన నివాసంలో ఉంచుకున్నారని న్యాయవాదులు ఆరోపించారు.

ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో రాజేందర్‌రెడ్డి నివాసం, రాయచూర్ నవోదయ వైద్య కళాశాలపై దాడులు నిర్వహించి రూ. 18 కోట్లు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే. కర్ణాటకలోని రాయచూరులో రాజేందర్ రెడ్డికి నవోదయ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరిట విద్యాలయం ఉంది. ఆయనకు రాయచూరులోనూ సొంతిల్లు ఉంది.

Telangana advocate JAC complains against TDP MLA Rajender Reddy

ఇటీవల రాజేందర్ రెడ్డికి చెందిన కళాశాలతో పాటు ఇంటిపైనా కర్ణాటక ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ నగదుతో పాటు పలు కీలక పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రూ.18 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఐటీ అధికారులో ఏకకాలంలో నివాసం, కార్యాలయాలు, విద్యాలయంలో సోదాలు నిర్వహించారు.

ఆ రోజు ఉదయం నుంచే ఈ సోదాలు కొనసాగినా, రాత్రి వరకూ ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. మీడియా ప్రతినిధులను లోనికి అనుమతించలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో (2014) రాజేందర్ రెడ్డి తన ఆస్తులను రూ.29 కోట్లుగా ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇతనికి కర్నాటకలోని రాయచూర్‌లో చాలా ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. రాజేందర్ రెడ్డి రాయచూర్‌లోనే ఓ కళాశాలలో ఎంఫార్మా పూర్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+