పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు: 'చిరంజీవిపై కూడా మాట్లాడి ఉంటే...'
హైదరాబాద్: జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై హైదరాబాదులోని నాంపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. కాకినాడ సీమాంధ్రుల ఆత్మగౌరవ సభలో పవన్ ప్రసంగంపై తెలంగాణ న్యాయవాదుల జెఎసి ప్రతినిధులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీయడంతో పాటు భారత రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా మాట్లాడారని న్యాయవాదులు తమ ఫిర్యాదులో విమర్శించారు. పవన్ కల్యాణ్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

పవన్ కల్యాణ్ ఎవరో రాసిచ్చిన డైలాగులు చెప్పి ప్రజలను రెచ్చగొట్టడం సరికాదని బీజేపీ నేత సుధీష్ రాంబొట్ల అన్నారు. పవన్ తన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలని సూచించారు. ఏపీకి ప్యాకేజీ మీకు పాచిపోయిన లడ్డూలా కన్పిస్తోందా అని ప్రశ్నించారు.
మంత్రి పదవి కోసం పార్టీని విలీనం చేసిన తన అన్న చిరంజీవి గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవి తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications