పెన్షన్ల పెంపు, నెలకు రూ 2,500 అమలు పై తాజాగా...!!
తెలంగాణ ప్రభుత్వం హామీల అమలు దిశగా నిర్ణయాలు తీసుకుంటోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో ఇప్పటికే కొన్నింటికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది. మిగిలినవి సైతం పట్టాలెక్కించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆర్దికంగా వెసులుబాటు కోసం అన్వేషిస్తోంది. అందులో భాగంగా పెన్షన్ల పెంపు, ఆడవాళ్లకు ప్రతి నెలా రూ. 2500 ఆర్థిక సాయం హామీల అమలు పైన స్పష్టత ఇచ్చేందుకు సిద్దమవుతోంది.
అమలు దిశగా
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం రైతుభరోసా అమలు పైన రైతుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తోంది. పది ఎకరాల సీలింగ పైన రైతుల నుంచి ఆమోదం వస్తోంది. ఈ ప్రతిపాదన పైన అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది. మిగిలిన పథకాల అమలు పైన ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చింది. హామీ ఇచ్చిన విధంగా రూ 2 లక్షల రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోగా పూర్తి చేసి ఆ తరువాత ఇతర పథకాల అమలు దిశగా నిర్ణయాలు తీసుకోవాలనిడిసైడ్ అయింది.

బడ్జెట్ సమావేశాలు
ఇక, పథకాలకు నిదులు..కేటాయింపుల పైన స్పష్టత ఇచ్చేందుకు అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం సిద్దమవుతోంది. ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాల నిర్వహాణపై మండలి ఛైర్మన్, అసెంబ్లీ స్పీకర్ రివ్యూ ేసారు. ఎన్నికల ముందు ఓట్ ఆన్ ఎకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఈ నెల 24 నుంచి ప్రారంభం అయ్యే సమావేశాల్లో ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల బడ్జెట్ ను ప్రభుత్వం సభలో ప్రవేశ పెట్టనుంది.
నిధుల కేటాయింపు
ఓట్ ఆన్ ఎకౌంట్ లో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిధి రూ.10 లక్షలకు పెంపు, రూ.500కే గ్యాస్ సిలెండర్, 200 యూనిట్ల వరకు ఉచిత గృహ విద్యుత్‌లకు నిధులు ప్రతిపాదించారు. ఇప్పుడు ప్రవేశ పెట్టే బడ్జెట్ లో రైతుభరోసా, రైతు రుణమాఫీ, పింఛన్లు, కొత్త ఉద్యోగాల కల్పనలకు అవసరమైన నిధులను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది. అదే విధంగా మహాలక్ష్మి పథకం కింద అర్హులైన.. 18 ఏళ్లు నిండిన ఆడవాళ్లకు ప్రతి నెలా రూ. 2500 ఆర్థిక సాయం పైనా స్పష్టత ఇవ్వనున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో ఆయన తొలిసారిగా సభకు రానున్నారు.












Click it and Unblock the Notifications