Telangana budget: గవర్నర్ ప్రసంగం లేకుండానే తెలంగాణా బడ్జెట్..ఏం జరుగుతోంది?

హైదరాబాద్: ఏపీ, తెలంగాణ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఆరంభం కానున్నాయి. ఏపీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించనున్నారు. తెలంగాణలో మాత్రం ఆ పరిస్థితి లేదు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు ఆరంభం కానున్నాయి. ఏపీలో ఈ నెల 11వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పిస్తారు. తెలంగాణలో తొలి రోజే బ‌డ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అనంత‌రం జ‌రిగే బీఏసీ స‌మావేశమౌతుంది. అసెంబ్లీని ఎన్నిరోజుల పాటు నిర్వహించాలనేది ఖరారు చేస్తుంది. రెండు వారాల పాటు తెలంగాణ బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. బడ్జెట్ అవుట్ లే 2,50,000 కోట్ల రూపాయల వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఏపీ, తెలంగాణల బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన పూర్తి వివరాలు మినిట్ టు మినిట్ అప్‌డేట్స్ మీకోసం..

Telangana Assembly Bugdet Session 2022-23 Live Updates In Telugu.

Mar 07, 2022, 5:59 pm IST

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌‌పై బండి సంజయ్, మంత్రి హరీశ్ రావు మధ్య మాటల యుద్దం
Mar 07, 2022, 4:19 pm IST

సస్పెన్షన్‌ సరికాదు అంటోన్న బీజేపీ ఎమ్మెల్యేలు
Mar 07, 2022, 2:41 pm IST

ప్రతిపక్షాలపై స్పీకర్ వ్యవహరించిన తీరు సరిగాలదు: కాంగ్రెస్, బీజేపీ
Mar 07, 2022, 2:40 pm IST

వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు కేటాయింపు
Mar 07, 2022, 1:31 pm IST

ఉదయం 11.31 నుంచి మధ్యాహ్నాం 1.31 వరకు రెండు గంటల బడ్జెట్ స్పీచ్ ఇచ్చిన మంత్రి హరీశ్ రావు
Mar 07, 2022, 1:31 pm IST

ఆర్థికమంత్రి హరీశ్ రావు ప్రతిపాదనలు చేయగా.. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సభను ఎల్లుండికి వాయిదా వేశారు.
Mar 07, 2022, 1:30 pm IST

జీవన్ రెడ్డి, షకీల్ అహ్మద్‌కు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు
Mar 07, 2022, 1:29 pm IST

క్యాపిటల్ వ్యయం 29, 728.44 కోట్లు కేటాయింపు
Mar 07, 2022, 1:29 pm IST

రెవెన్యూ వ్యయం 1, 89,274. 82 కోట్లు కేటాయింపు
Mar 07, 2022, 1:28 pm IST

తెలంగాణ బడ్జెట్ 2,56,958.51 కోట్లు కేటాయింపు
Mar 07, 2022, 1:28 pm IST

శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడటంలో పోలీసు శాఖ అద్భుతంగా పనిచేస్తోంది: హరీశ్ రావు
Mar 07, 2022, 1:27 pm IST

డ్రగ్స్ ఉత్పత్తి, సరఫరాపై ఉక్కుపాదం
Mar 07, 2022, 1:26 pm IST

21 కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణం పూర్తయింది.. 24 గంటల్లో నేరస్తులను పట్టుకునేందుకు వీలుంది.
Mar 07, 2022, 1:24 pm IST

అంకుర సంస్థలకు టీ హబ్ వరంగా మారింది
Mar 07, 2022, 1:21 pm IST

ప్రాజెక్టు పరిధిలో ఉన్న జలశయాలను డెవలప్ చేస్తాం: హరీశ్ రావు
Mar 07, 2022, 1:20 pm IST

అన్యాక్రాంతమైన 2 వేల ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది: హరీశ్ రావు
Mar 07, 2022, 1:19 pm IST

1000 ఎకరాల్లో యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణం
Mar 07, 2022, 1:19 pm IST

భూలోక వైకుంఠంగా యాదాద్రి
Mar 07, 2022, 1:18 pm IST

ఎమ్మెల్యేల కోసం క్యాంపు ఆఫీసు నిర్మాణం జరిగాయి.
Mar 07, 2022, 1:17 pm IST

ఆధునాతన హంగులతో కలెక్టరేట్ల నిర్మాణం జరిగింది
Mar 07, 2022, 1:17 pm IST

ఈ సంవత్సరంలోనే సచివాలయ నిర్మాణం పూర్తవడంతో ప్రారంభించబోతున్నాం: హరీశ్ రావు
Mar 07, 2022, 1:17 pm IST

ఆధునాతన హంగులతో సచివాలయం సిద్దం అవుతుంది
Mar 07, 2022, 1:16 pm IST

రీజనల్ రింగ్ రోడ్డు.. తెలంగాణ అభివృద్దికి ఊతం ఇవ్వనుంది: హరీశ్ రావు
Mar 07, 2022, 1:14 pm IST

భూ పరిపాలనలో ధరణి నవ శకానికి నాంది పలికింది
Mar 07, 2022, 1:14 pm IST

మెట్రో పనుల్లో అవంతరాలు.. కోవిడ్ వల్ల ప్రాజెక్టుకు నష్టం వాటిల్లింది
Mar 07, 2022, 1:12 pm IST

ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ అభివృద్ది కోసం 300 కోట్ల నిధులు
Mar 07, 2022, 1:10 pm IST

భవన నిర్మాణ రంగంలో గల కార్మికులకు, లక్ష మందికి సబ్సిడీపై మోటారు వాహనాలు అందజేస్తాం: హరీశ్ రావు
Mar 07, 2022, 1:10 pm IST

దేశంలో అత్యధిక జీతం పొందుతుంది.. తెలంగాణ ఉద్యోగులే: హరీశ్ రావు
Mar 07, 2022, 1:09 pm IST

రేషన్ కోటా ఒక్కొక్కరీ 10 కిలోల బియ్యం అందజేత
Mar 07, 2022, 1:08 pm IST

కరోనా సమయంలో వైరస్ సోకిన 10 వేల మంది జర్నలిస్టులకు రూ.10 వేల వరకు నగదు అందజేత
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+