Telangana election results 2023: ప్రారంభ ఫలితాల్లో ఆ పార్టీదే భారీ ఆధిక్యత
Telangana Congress: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. సరిగ్గా ఈ ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లతో కౌంటింగ్ మొదలైంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
తెలంగాణతో పాటు అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లల్లో కూడా ఫలితాలు వెలువడుతున్నాయి. మిజోరం ఎన్నికల ఓట్ల లెక్కింపును కూడా ఇవ్వాళే చేపట్టాల్సి ఉన్నప్పటికీ.. ఆ రాష్ట్ర రాజకీయ నాయకుల నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు ఈ ప్రక్రియను సోమవారానికి వాయిదా వేసింది కేంద్రం ఎన్నికల కమిషన్.

తెలంగాణలో పోలింగ్ ముగిసిన రోజు వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టిన విషయం తెలిసిందే. ఒకట్రెండు ఎగ్జిట్ పోల్స్ హంగ్ వైపు మొగ్గు చూపాయి. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి తీరుతుందంటూ ఏ ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా స్పష్టం చేయలేదు. హస్తం పార్టీకి భారీ మెజారిటీని అందించాయి.
ఫలితంగా- కాంగ్రెస్ పార్టీలో జోష్ పెరిగింది. ఆ పార్టీ నాయకులందరూ సంబరాలు చేయడానికి సన్నద్ధం అయ్యారు. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్ లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తోందనే సంకేతాలు కూడా అందుతున్నాయి.
దీనికి అనుగుణంగానే ఓట్ల లెక్కింపు ఆధిక్యత వెలువడింది. ఓట్ల లెక్కింపు ఆరంభమైన వెంటనే కాంగ్రెెస్ పార్టీ ఆధిక్యతలోకి దూసుకెళ్లింది. ఆ పార్టీ ఏకంగా 27 స్థానాల్లో ఆధిక్యతలో కనిపించింది. భారత్ రాష్ట్ర సమితి రెండో స్థానంలో నిలిచింది. 17 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఆధిక్యతలో ఉన్నట్లు ప్రారంభ ఓట్ల లెక్కింపు స్పష్టం చేసింది. ఇక భారతీయ జనతా పార్టీ ఒక్క స్థానంలో లీడ్‌ను సాధించింది.












Click it and Unblock the Notifications