కేసీఆర్ అవసరం లేదు: అసెంబ్లీలో రేవంత్, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగుతున్నాయి. అధికార పక్షం, ప్రతిపక్షం నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ సభ్యులు కేంద్రంపై విమర్శలు గుప్పించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్, బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అవగాహన రాహిత్యంతో కేటీఆర్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారని రేవంత్ విమర్శించారు.
అసెంబ్లీలో కీలకమైన చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎందుకు రాలేదని సీఎం రేవంత్ ప్రశ్నించారు. దీనికి కేటీఆర్ బదులిస్తూ.. మాకు జవాబు చెప్పండి చాలు.. మీకు కేసీఆర్ అవసరం లేదు అని అన్నారు. దీంతో సీఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను తండ్రి పేరు చెప్పుకుని మంత్రిని కాలేదని.. కింది స్థాయి నుంచి ఎదిగి ముఖ్యమంత్రిని అయ్యానని రేవంత్ చెప్పారు.

కేటీఆర్‌ది మేనేజ్‌మెంట్ కోటా అనుకున్నా.. అంతకంటే దారుణం అంటూ రేవంత్ విమర్శించారు. దీనికి కేటీఆర్ కౌంటర్ ఇస్తూ.. రేవంత్ పేమెంట్ కోటాలో సీఎం అయ్యారని తామూ అనొచ్చు అని వ్యాఖ్యానించారు. తాను పేమెంట్ కోటాలో సీఎంను కాలేదని రేవంత్ చెప్పారు. మొన్న బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లి చీకట్లో మాట్లాడుకుని వచ్చారన్నారు. మేనేజ్ మెంట్ కటాలో మంత్రినయ్యానని.. సీఎం అనొచ్చా? అని ప్రశ్నించారు కేటీఆర్.
సీఎం రేవంత్ మాట్లాడుతూ.. మన రావాల్సిన హక్కులు, నిధులు, అనుమతులపై పోరాడుతున్నామన్నారు. రాష్ట్ర ప్రజల తరఫున అందరూ కలిసి కేంద్రాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్‌పై చర్చించమంటే కేటీఆర్ ఆవు కథ చెబుతున్నారు. కేంద్రానికి, బీజేపీకి కోపం వస్తుందని కేటీఆర్ పదేపదే ఆవు కథ చెబుతున్నారని ఆరోపించారు.
కేంద్రానికి కేసీఆర్ ఎలా ఊడిగం చేశారో నేను కొన్ని ఉదాహరణలు చెబుతా.
జీఎస్టీ బిల్లుకు అందరి కంటే ముందు కేసీఆర్ మద్దతు ఇచ్చారు.
ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి కేసీఆర్ మద్దతు తెలిపారు.
ఆర్టీఐకి తూట్లు పొడిచేందుకు తెచ్చిన సవరణ బిల్లుకు కేసీఆర్ మద్దతిచ్చారు.
ప్రత్యేక విమానంలో వెళ్లి మరీ సంతోష్ ఆర్టీఐ సవరణ బిల్లుకు మద్దతిచ్చారు అని రేవంత్ వ్యాఖ్యానించారు.
నోట్ల రద్దును అద్భుతమంటూ అప్పట్లో కేసీఆర్ ఆకాశానికెత్తారు. ఆనాటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకు అనుకూలంగా బీఆర్ఎస్ ఓట్లేసింది. ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ అంశాల్లో బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది. మాకేమీ అక్కర్లేదు.. మీ ప్రేమ చాలని చెప్పిన మనిషి కేసీఆర్ వ్యాఖ్యానించారని సీఎం రేవత్ చెప్పారు. విద్యుత్‌పై రాష్ట్రంలో ఇప్పటివరకు ఒక విధానమే లేదని మండిపడ్డారు.
రూ.7 లక్షల కోట్లు అప్పులు చేసి వెళ్లిపోయారని గత కేసీఆర్ ప్రభుత్వంపై సీఎం రేవంత్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీసింది. బీఆర్ఎస్ పరిపాలనలో విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది.
మీరేం చేశారో చూశాకే ప్రజలు తీర్పు ఇచ్చారని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు.
అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. విభజన సమయంలో తెలంగాణ హక్కుల కోసం ఎంతో పోరాడమని, మోడీ సర్కారుపై తెలంగాణ కోసం అనేక పోరాటాలు చేశామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన చర్చను సమర్థిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర హక్కులు ఎవరు హరించినా వారి మెడలు వంచుామన్నారు. యాచిస్తే ఏమీ రాదని.. శాసించి సాధించుకోవాలన్నారు. ఢిల్లీ తత్వం ఇంతకాలానికి కాంగ్రెస్ పార్టీకి బోధడిందన్నారు.
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే.. ఇక్కడి కాంగ్రెస్‌కి ఇబ్బందేంటని ప్రశ్నించారు. కేంద్ర వివక్షను ఎండగట్టడంలో తాము సహకరిస్తామని కేటీఆర్ చెప్పారు. గతంలో కేంద్రం సహకరించకపోయినా తాము రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని కేటీఆర్ చెప్పారు తాము కేంద్రం ప్రవేశపెట్టిన అన్ని బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇవ్వలేదన్నారు. తాము ఏది చేసినా బహిరంగంగానే చేస్తామని.. చీకట్లో ఒప్పందాలు మాకు అలవాటు లేదని అన్నారు. కేంద్రం నిధులు ఇవ్వదు.. సీఎం, మంత్రులు రాష్ట్రంపై నిందలు వేస్తారు అంటూ మండిపడ్డారు.
కేటీఆర్‌కు రేవంత్ శుభాకాంక్షలు
సీఎం రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నిత్యం ప్రజాసేవ చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలన్నారు. కేటీఆర్‌కు భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలన్నారు. ఈ క్రమంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు కేటీఆర్.












Click it and Unblock the Notifications