ఫ్యాన్సీ నెంబర్ కోసం 30వేలు చెల్లించిన తెలంగాణ స్పీకర్ చారి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి తన ఇన్నోవా వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి మంగళవారం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా రవాణాశాఖ కమిషనర్ సందీప్ కుమార్ సుల్తానియా, జేటీసా రఘనాథ్, ఆర్టీవోలు దశరథం, జీపీఎస్ ప్రసాద్‌లు స్పీకర్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు.
రెండు వారాల క్రితం టీఎస్ 09 ఈఎల్ 5555 నెంబర్‌ను తన వాహనం కోసం రిజర్వ్ చేసుకున్నారు. ఇందు కోసం ఆయన రవాణా శాఖకు రూ. 30,000 వేల చెల్లించారు. అయితే ఈ నెంబర్ కోసం మరెవరూ పోటీ పడక పోవడంతో ఈ నెంబర్‌ను ఆయనకే రవాణాశాఖ కేటాయించింది.
రిజిస్ట్రేషన్ కోసం వచ్చిన ఆయన ఫోటోతో పాటు డిజిటల్ సంతకం చేశారు. ట్రాఫిక్ సమస్యపై చర్చించిన స్పీకర్ మధుసూధనాచారి ఢిల్లీలో సరి, బేసి సంఖ్య విధానం ఎంతవరకు ఫలించిందని రవాణాశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు.













Click it and Unblock the Notifications