కెసిఆర్‌తో ఢీకి అందరూ కలిశారు, బంద్ ఎఫెక్ట్: దిగొచ్చారు (పిక్చర్స్)
హైదరాబాద్: రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలని, అలాగైతేనే ఆత్మహత్యలు ఆగుతాయని డిమాండ్ చేస్తూ... విపక్షాలు శనివారం తలపెట్టిన ధర్నా కొంత ఉద్రిక్తతకు దారి తీసింది. విపక్షాలు బంద్‌కు పిలుపునివ్వగా... అధికార పార్టీ దీనిని అడ్డుకునే కుట్ర చేసిందని మండిపడ్డారు.
కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, వామపక్షాలకు తోడు ప్రజా సంఘాలు కూడా బందులో పాల్గొన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఉదయం నుంచే అరెస్టుల పర్వం ప్రారంభించారు. అరెస్టుల పైన జానా రెడ్డి సహా విపక్ష నేతలు మండిపడ్డారు.
మరోవైపు, బంద్ పైన అధికార టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. బంద్ పైన మండిపడ్డ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి... రైతు రుణమాఫీ పైన కూడా స్పందించారు. వడ్డీతో సహా ప్రభుత్వమే త్వరలో చెల్లిస్తుందన్నారు. రైతుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
రైతులు బ్యాంకులకు వడ్డీలు కట్టవద్దని సూచించారు. త్వరలో పూర్తిస్థాయి రుణమాఫీ అమలు చేస్తామని పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. రైతుల నుంచి వసూలు చేసిన వడ్డీని కూడా తిరిగి కట్టిస్తామని చెప్పారు. కాగా, విపక్షాల బంద్ నేపథ్యంలో పోచారం ప్రకటన చేశారు.

తెలంగాణ బంద్
రైతులకు రుణమాఫీ ఒకేదఫా చేయాలని, వారి సమస్యల పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్, టిడిపి, బిజెపి, వామపక్షాలు, వైసిపి పోరుబాట పట్టాయి.

తెలంగాణ బంద్
రుణమాఫీకి ఏకమొత్తంలో నిధులు విడుదల చేయాలని, రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్ నిర్వహించాయి.

తెలంగాణ బంద్
బంద్ ప్రభావంతో పలు డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. తెల్లవారుజాము నుంచే ప్రతిపక్ష నాయకులు డిపోల వద్దకు చేరుకుని బస్సులను అడ్డుకున్నారు.

తెలంగాణ బంద్
ఆదిలాబాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో బస్సుల రాకపోకలకు అంతరాయమేర్పడింది.

తెలంగాణ బంద్
అబిడ్స్ సహా రెండుమూడుచోట్ల గుర్తు తెలియని వ్యక్తులు రెండు ఆర్టీసీ బస్సుల అద్దాలను రాళ్లతో కొట్టి, ధ్వంసం చేశారు.

తెలంగాణ బంద్
ఛాంబర్ ఆఫ్ కామర్స్ విపక్షాల బంద్‌కు మద్దతు తెలిపింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.

తెలంగాణ బంద్
హైదరాబాద్ సహా, వివిధ జిల్లాల్లో ఆందోళనకు దిగిన విపక్ష నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ ఎంజీబీఎస్ వద్ద ఆందోళనకు దిగిన కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య, అంజన్ కుమార్ యాదవ్, సీపీఐ నేత నారాయణ తదితరులను అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

తెలంగాణ బంద్
సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద ఆందోళనకు దిగిన టిడిపి నేతలు ఎల్ రమణ, ఎర్రబెల్లి దయాకర రావు, రేవంత్ రెడ్డి, బిజెపి నేతలు లక్ష్మణ్, చింతల రామచంద్రా రెడ్డి, కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులను పోలీసులు అరెస్టు చేశారు.

తెలంగాణ బంద్
బంద్ సందర్భంగా హైదరాబాదులో బీజేపీ కార్యకర్తలపై ఓ దుకాణం యజమాని కత్తితో దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది.

తెలంగాణ బంద్
వనస్థలిపురంలోని ఎన్టీఆర్ నగర్‌లో బీజేపీ కార్యకర్తలు షాపులు మూయిస్తున్న సమయంలో ఓ షాపు యజమాని అనూహ్యంగా కార్యకర్తలపై కత్తితో దాడి చేశాడు.

తెలంగాణ బంద్
ఈ సమయంలో ఒకరిద్దరికి గాయాలయ్యాయి. దాంతో ఆగ్రహించిన కార్యకర్తలు తిరిగి యజమానిపై దాడికి పాల్పడ్డారు.

తెలంగాణ బంద్
రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షాలు నిర్వహిస్తున్న తెలంగాణ బంద్ నేపథ్యంలో హైదరాబాదులో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.

తెలంగాణ బంద్
నగరంలోని అన్ని డిపోల వద్ద శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న అఖిలపక్షాల నేతలను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు.

తెలంగాణ బంద్
అబిడ్స్ జీపీఓ వద్ద రెండు సిటీ బస్సులపై కొందరు ఆందోళనకారులు రాళ్లు విసిరారు. దాంతో బస్సుల అద్దాలు పగలిపోయాయి. ఎవరికీ గాయాలు కాలేదు. నాంపల్లిలో కూడా కొందరు ఆందోళనకారులు ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వడంతో అద్దాలు పగిలిపోయాయి.












Click it and Unblock the Notifications