మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వీధుల్లో రైతుల ఫోటోలతో ఫ్లెక్సీలు.. బజారుకీడ్చి పరువు తీస్తారా... ఆత్మహత్య చేసుకుంటే మీదే బాధ్యత..

|
Google Oneindia TeluguNews

మెదక్ జిల్లాలోని పాపన్నపేట కోఆపరేటివ్ బ్యాంకు అధికారుల తీరుపై రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. రుణాలు చెల్లించలేదన్న కారణంతో రైతుల ఫోటోలతో బ్యాంకు అధికారులు వీధుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో తమ పరువు బజారున పడిందని రైతులు వాపోతున్నారు. వేల కోట్ల రూపాయల అప్పులు ఎగ్గొట్టే బడా పారిశ్రామికవేత్తల పట్ల ఉదాసీనంగా వ్యవహరించే బ్యాంకులు ఇలా సామాన్యులు,రైతులపై మాత్రమే తమ ప్రతాపం చూపిస్తాయా అంటూ సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బకాయిలు చెల్లించలేదన్న కారణంతో...

బకాయిలు చెల్లించలేదన్న కారణంతో...


పాపన్నపేటకు చెందిన రైతులు పంట పెట్టుబడి కోసం బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారు. అయితే కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సమస్యలతో సకాలంలో రుణాలు చెల్లించలేకపోయారు. దీంతో బ్యాంకు అధికారులు రైతుల ఫోటోలతో గ్రామంలోని వీధుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. బ్యాంకుకు వీరు బకాయిపడినట్లు అందులో పేర్కొన్నారు. బ్యాంకు అధికారుల చర్యలతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. రుణాల చెల్లింపులో కాస్త ఆలస్యం జరిగినందుకే ఇలా ఫ్లెక్సీలతో పరువు తీస్తారా అని వాపోతున్నారు.

'రైతులు ఆత్మహత్యకు పాల్పడితే వారిదే బాధ్యత'

'రైతులు ఆత్మహత్యకు పాల్పడితే వారిదే బాధ్యత'

'తిందామంటే తిండికి లేదు.. కరోనా లాక్‌డౌన్‌తో స్కూల్లో పిల్లలకు కూడా ఫీజులు కట్టలేకపోతున్నాం.. ఇలాంటి సమయంలో అధికారులు బకాయి వసూళ్ల కోసం గుంపులు గుంపులుగా ఇళ్ల మీద పడటం సరికాదు.
ఈ వేధింపులకు ఎవరైనా ఆత్మహత్యకు పాల్పడితే బ్యాంకులదే బాధ్యత.' అని స్థానిక రైతు ఒకరు వాపోయారు. కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమకు మరికొంత గడువు ఇవ్వాలని బ్యాంకు అధికారులను కోరామని... అయినా తమ విజ్ఞప్తిని వారు పట్టించుకోలేదని రైతులు వాపోతున్నారు. అసలే కష్టాల్లో ఉన్న తమను ఇలా ఫ్లెక్సీల్లో ఫోటోలు వేసి మరింత క్షోభకు గురిచేస్తున్నారని అంటున్నారు.

బ్యాంకు అధికారులు ఏమంటున్నారు...

బ్యాంకు అధికారులు ఏమంటున్నారు...

మరోవైపు బ్యాంకు అధికారుల వాదన మరోలా ఉన్నది. ఇదంతా చట్టబద్దంగా చేశామని... ఇదివరకే పలుమార్లు వారికి అవకాశమిచ్చామని చెప్పారు. అన్ని అవకాశాలు అయిపోయాకే... చివరగా ఇలా ఫ్లెక్సీల్లో ఫోటోల వరకూ వచ్చిందన్నారు. మొత్తం 15 మంది ఫోటోలను ఫ్లెక్సీల్లో వేశామని... దానిపై స్పందించి తమను సంప్రదించినవారికి మళ్లీ అవకాశం కల్పిస్తున్నామని తెలిపారు. ఇంకా స్పందించనవారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. ఇదేమీ హఠాత్తుగా జరిగింది కాదని... ఏడాదిగా బకాయిలు చెల్లించాలని వారికి పదేపదే విజ్ఞప్తి చేశామని తెలిపారు.

English summary
Farmers are angry over the behavior of Papannapeta Cooperative Bank officials in Medak district. Bank officials set up flexis in the streets with photos of farmers for non-payment of loans. Farmers are voicing that their reputation has been tarnished in the market.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X