Bandi Sanjay: సీపీ రంగనాథ్‍ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు.. బండి సంజయ్ హెచ్చరిక..!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. కేసీఆర్ కు మానవ సంబంధాలు కాదు.. మనీ సంబంధాలే ముఖ్యమని దుయ్యబట్టారు. గతంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని తన బిడ్డ పెళ్లిని చూడకుండా చేశాడని గుర్తు చేశాడు. కేసీఆర్ కుటుంబ విలువలు తెలుసుకోవాలన్నారు.
తెలంగాణలో నిరుద్యోగం తప్పా ఇంకేమి లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై లాఠీ చార్జ్ చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలను దోచుకుంటున్నాడని విమర్శించారు. తనపై కావాలానే కేసు పెట్టారని చెప్పారు.

తన ఫోన్ ను ఎవరు ఎత్తుకు పోయారని చెప్పారు. పోలీసులే తన మొబైల్ దొంగిలించారని ఆరోపించారు. ప్రశాంత్ వాట్సాప్ చేస్తే తాను సాయంత్రం 5 గంటలకు చూసుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు. పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటలకే అయిపోయిందన్నారు.
అటు హనుమకొండ సీపీ రంగనాథ్ పై కూడా బండి సంజయ్ విరుచుకుపడ్డారు. రంగనాథ్ ను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. రంగనాథ్ విజయవాడ, ఖమ్మం, వరంగల్ లో ఏ దందాలు చేశాడో తెలుసన్నారు. వాటన్నింటిని బయటకు తీసుకొస్తామని హెచ్చరించారు.
అమాయకుల మీద ఆరోపణలు తప్పా ఇంకేమి చేయలేడని చెప్పారు. దమ్ముంటే తనపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్లాంట్ పై కేసీఆర్ ఏం అవసరమని ప్రశ్నించారు.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) April 10, 2023
నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవమంటే చేతకాని వాళ్లు విశాఖ ఉక్కు గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ తెరిచి 20 వేల మందికి ఉద్యోగాలు ఇస్తా అని కేసీఆర్ 2018లో హామీ ఇచ్చాడని బండి సంజయ్ గుర్తు చేశాడు.
కాగా ఆదివారం బండి సంజయ్ తన ఫోన్ పోయినట్లు పోలీసులకు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేశారు. కరీంనగర్ లో పోలీసులు తనను అరెస్ట్ చేసే క్రమంలో ఫోన్ పోయిందని వివరించారు. టెన్త్ హిందీ పేపర్ వైరల్ కేసులో బండి సంజయ్ ని మంగళ వారం పోలీసులు అరెస్ట్ చేశారు. బండి సంజయ్ శుక్రవారం బెయిల్ పై విడుదలయ్యారు. ప్రశాంత్ అనే వ్యక్తి పేపర్ లీక్ చేయడానికి బండి సంజయ్ ప్రయత్నించాడని హనుమకొండ సీపీ రంగనాథ్ మీడియా సమావేశంలో చెప్పారు.












Click it and Unblock the Notifications