పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల: ఇలా చూసుకోవచ్చు
హైదరాబాద్: పదో తరగతి పరీక్షా ఫలితాలను మంత్రి కడియం శ్రీహరి శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. ఈ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం 83.78గా ఉంది. బాలికల ఉత్తీర్ణత శాతం 58.14గా, బాలురది 82.46 శాతంగా ఉంది.
జగిత్యాల జిల్లా మొదటి స్థానంలో ఉండగా, అదిలాబాద్ చివరి స్థానంలో ఉంది. పరీక్షలకు 5 లక్షల 38వేల 736 మంది హాజరయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఉత్తీర్ణత 94 శాతం, మోడల్ స్కూళ్లలో 92.16 శాతం ఉంది. బీసీ వెల్ఫేర్ స్కూళ్లలో 96.18 శాతంగా ఉంది.
2,125 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత వచ్చింది. 21 ప్రభుత్వ స్కూల్స్, 11 ప్రయివేటు స్కూల్స్‌లలో జీరో శాతం ఉత్తీర్ణత ఉంది. జూన్ 4 నుంచి 19 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తారు. సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ మే 21.
తొలుత శుక్రవారం ఉదయం పది గంటలకు ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించారు. కానీ అనూహ్యంగా వాటిని రాత్రి ఏడు గంటలకు మార్చారు. దీంతో సాయంత్రం విడుదల చేశారు. ఫలితాలను bse.telangana.gov.in చూసుకోవచ్చు.













Click it and Unblock the Notifications