ఆ విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్టైఫండ్ పెంచిన తెలంగాణ ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలోని వైద్య విద్యార్థులకు గుడ్ న్యూస్. స్టైఫండ్ 15 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మెడికల్, డెంటల్ విద్యార్థులతో పాటు సీనియర్ రెసిడెంట్లకు స్టైఫండ్ ను 15 శాతం పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాక వైద్యారోగ్యశాఖలోని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 16 వేల మంది సిబ్బంది పదవీ కాలాన్ని పొడిగించింది.
తెలంగాణలోని వైద్య విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మెడికోలకు స్టైఫండ్ 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు వైద్యారోగ్యశాఖలోని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 16వేల మంది సిబ్బంది పదవీ కాలాన్ని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం.
రాష్ట్రంలోని మెడికల్ విద్యార్థులకు 15 శాతం స్టైఫండ్ పెంచడంతో వేలాది మంది విద్యార్థులకు ఆర్థికంగా ఊరట లభించింది. మెడికల్, డెంటల్ విద్యార్థులతో పాటు సీనియర్ రెసిడెంట్లకు స్టైఫండ్ ను 15 శాతం పెంచుతున్నట్లు ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. తాజా పెంపు కారణంగా ఇంటర్న్ లకు నెలకు రూ.29,792 స్టైఫండ్ లభించనుంది. పీజీ డాక్టర్లకు ఫస్ట్ ఇయర్ లో రూ.67,032 గౌరవ వేతనం, సెకండ్ ఇయర్ లో రూ.70,757.. ఇక ఫైనల్ ఇయర్ లో రూ.74,782 గౌరవ వేతనం లభించనుంది.

స్టైఫండ్ పెంపుతో పాటు, తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య శాఖలో పని చేస్తున్న దాదాపు 16,448 మంది ఉద్యోగుల సర్వీసును మరో ఏడాది పాటు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పొడిగింపు ఏడాది పాటు ఉంటుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో పని చేస్తున్న వివిధ కేటగిరీల ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. ప్రస్తుతం 4,772 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, 8,615 మంది ఔట్ సోర్సింగ్, హానరోరియమ్ పోస్టుల్లో 3,056 మంది పని చేస్తున్నారు. మరో 5 మంది MTS కింద పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు.












Click it and Unblock the Notifications