తెలంగాణలో పుట్టిన వారికి భారీ శుభవార్త.. రూ. 20 లక్షలు.. అర్హులు వీళ్లే..!
అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, యూరోప్.. లాంటి దేశాలకు వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించాలని లక్షలాది మంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అలాంటి పేద, మధ్యతరగతి విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. సీఎం ఓవర్సీస్ పథకం కింద పేద, మధ్య తరగతి మైనారిటీ విద్యార్థులు ఫ్రీగా విదేశాలకు వెళ్లొచ్చు. ఇందుకు మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని మైనారిటీ విద్యార్థుల కోసం సరికొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కు 'సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఫర్ మైనారిటీస్' అని పెట్టింది. ఈ పథకం కింద మైనారిటీ విద్యార్థులు ప్రపంచంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఫ్రీగా చదువుకోవచ్చు. ఈ పథకం విద్యార్థికి పూర్తి ఆర్థిక సాయం ప్రభుత్వమే అందిస్తుంది.
'సీఎం ఓవర్సీస్ స్కాలర్ షిప్ ఫర్ మైనారిటీస్' పథకం కింద ఎంపికైన 500 మంది మైనారిటీ విద్యార్థులకు రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్థిక సాయం రూ. 20 లక్షలు లేదా విద్యార్థి అడ్మిషన్ లెటర్ మీద ఎంత ఫీజు ఉంటే అంత మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. అంతేకాక మైనారిటీ విద్యార్థులకు విమాన ప్రయాణ టికెట్ కూడా ఉచితంగానే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఎకానమీ క్లాస్ టికెట్ అందిస్తుంది. విదేశాల్లో డాక్టరేట్, పీజీ చదవాలనుకునే విద్యార్థులకు ఇదో సువర్ణావకాశంగా భావించవచ్చు.

మైనారిటీ కుటుంబాలను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కోసం అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులకు అప్లికేషన్ లింక్ 8 జులై, 2025 న ప్రారంభం అవుతుంది. దరఖాస్తు చివరి తేదీ ఆగస్టు 7, 2025 వరకు ఉంటుంది. ఆన్ లైన్ విధానంలో ఈ పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
ఈ పథకం అప్లై చేసుకోవడానికి ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, పాన్ కార్డు, డొమిసైల్ సర్టిఫికేట్, రెసిడెన్షియల్ సర్టిఫికెట్, మైనారిటీ సర్టిఫికేట్, మార్కుల మెమో, పాస్ ఫోటోలు, బ్యాంక్ పాస్ బుక్ అవసరం. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో విద్యను అభ్యసించవచ్చు
-
సీఎం గారు లక్షమందిని కాపాడండి.. రేవంత్ రెడ్డికి వినూత్న విజ్ఞప్తి! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..!












Click it and Unblock the Notifications