బీఆర్ఎస్ ఆసక్తికర నినాదాలు- అసెంబ్లీ ఆవరణలో ఆందోళన

Telangana Budget 2025: తెలంగాణ బడ్జెట్ ఇంకాస్సేపట్లో సభ ముందుకు రాబోతోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖను పర్యవేక్షిస్తోన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రతిపాదనలను సభకు సమర్పించనున్నారు. ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.. శాసన మండలిలో దీన్ని ప్రవేశపెట్టనున్నారు.

2024-25 ఆర్థిక సంవత్సరంలో 2,91,059 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను ​ప్రవేశపెట్టింది. ఈ సారి ఈ సంఖ్య మూడు లక్షల కోట్లు దాటిందని తెలుస్తోంది. 3.20 లక్షల కోట్ల రూపాయల అంచనాతో వార్షిక బడ్జెట్ రూపొందినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో సమావేశమైన మంత్రివర్గం కొద్దిసేపటి కిందటే ఈ ప్రతిపాదనలను ఆమోదించింది.

BRS Protest

ఈ ఉదయం నల్లపోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలను నిర్వహించిన అనంతరం భట్టి విక్రమార్క.. బడ్జెట్ ప్రతిపాదనలతో అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం మంత్రివర్గ సమావేశానికి హాజరయ్యారు. రేవంత్ ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

నీటి పారుదల ప్రాజెక్టులు, వ్యవసాయం, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాలకు ఎలాంటి కేటాయింపులు ఉంటాయనేది ఆసక్తి రేపుతోంది. గృహావసరాలకు సరఫరా చేస్తోన్న ఉచిత విద్యుత్‌కూ అంచనాలకు తగ్గట్టుగా కేటాయింపులు ఉండొచ్చని తెలుస్తోంది. రేవంత్ సర్కార్.. పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, పన్నేతర రాబడిపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు.

భట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోయే బడ్జెట్ ప్రతిపాదనల సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ గైర్హాజర్ కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆయన అసెంబ్లీ రాలేదని చెబుతున్నారు. ఇంట్లో నుంచే బడ్జెట్ ప్రతిపాదనల ప్రసంగాన్ని వీక్షిస్తారని, దీనిపై విశ్లేషిస్తారని సమాచారం.

కాగా- బీఆర్ఎస్ శాసన, మండలి సభ్యులు ఆందోళనకు దిగారు. అసెంబ్లీ ఆవరణలో నిరసన ప్రదర్శన చేపట్టారు. మెడలో ఆకుపచ్చ కండువాలను ధరించి, ఎండిపోయిన పంట మొక్కలను పట్టుకుని కనిపించారు వారంతా. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రులు టీ హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత సహా పలువరు సభ్యులు బీఆర్ఎస్ శాసన సభా పక్ష కార్యాలయం నుంచి నినాదాలు చేస్తూ అసెంబ్లీ ఆవరణలోకి వచ్చారు. కొద్దిసేపు అక్కడ నినాదాలు ఇచ్చిన అనంతరం అసెంబ్లీ, మండలి సమావేశాలకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా వాళ్లు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఇది కాలం తెచ్చిన కరవు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరవుగా నినదించారు. సుమారు 20 నిమిషాల పాటు అసెంబ్లీ ఆవరణలో నినాదాలు ఇచ్చారు. హెక్టారుకు 25 వేల రూపాయల నష్ట పరిహారం ప్రకటించాలంటూ డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+