Telangana Budget 2025: సామాన్యులకు శుభవార్త.. ఆరోగ్యశ్రీ రూ.10లక్షలకు పెంపు

Telangana Budget 2025: తెలంగాణ అసెంబ్లీలో ఆర్థిక మంత్రిగా భట్టి విక్రమార్క మూడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక ఏడాదికి సంబంధించి రూ.3,04,965 కోట్లతో బడ్జెట్ ను సభలో సమర్పించారు. బడ్జెట్ లో ప్రభుత్వం సామాన్యులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆరోగ్యశ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు ప్రభుత్వం పెంచింది. కొత్తగా 1,835 వైద్య చికిత్సలను ఆరోగ్య శ్రీలో చేర్చారు. దీంతో 90 లక్షల పేద కుటుంబాలకు ఆరోగ్య శ్రీ ద్వారా లబ్ధి చేకూరనుంది. ఆరోగ్య శ్రీ ప్యాకేజీల ఖర్చును కూడా 20 శాతం పెంచారు. ఈ బడ్జెట్ లో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కోసం 1,143 కోట్లను కేటాయించారు.

రాష్ట్రంలో ప్రజల వైద్య కోసం ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య కళాశాలలకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. ఆరోగ్య శ్రీ కిదం ఉచిత వైద్యానికి భారీ మద్దతు అందించింది. వైద్య రంగానికి సర్కారు 12,393 కోట్లను బడ్జెట్ లో కేటాయించింది. ప్రజాప్రయోజనాలే ధ్యేయంగా, పారదర్శకత, జవాబుదారీతనంలో ప్రభుత్వం సాగుతోందని మంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం తెలంగాణ రైజింగ్ 2050 ప్రణాళికతో ముందుకెళ్తున్నామన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చేందుకు మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. రాబోయే కాలంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్ ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు.

Telangana Budget 2025 Health Benefits Increased with Rs 10 Lakh for Aarogyasri

ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తామని.. ఆ స్కూల్స్ లో ఐఐటీ జేఈఈ, నీట్ కోచింగ్ తో పాటు ఉచిత వసతులు అందిస్తామన్నారు. గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచుతామన్నారు. విద్యార్థులకు ఉచితంగా సాయంత్రం స్నాక్స్ పథకం తీసుకొస్తామన్నారు. ఏఐ సిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ముచ్చర్లలో యంగ్ ఇండియా టెక్నికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు శ్రీకారం చుడతామన్నారు. సంక్షేమ వసతి గృహాల్లో కామన్ డైట్ స్కీం అమలు ప్రారంభిస్తామన్నారు. పాఠశాలల్లో గ్రీన్ ఎనర్జీ కోసం సౌర విద్యుత్, విండ్ ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+