Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అందరికీ హెల్త్ ప్రొఫైల్! వైద్యరంగంలో 'తెలంగాణ రైజింగ్'

రాష్ట్రంలోని పేద ప్రజలందరికీ కార్పొరేట్ స్థాయి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రభుత్వం మరింత బలోపేతం చేస్తోందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. 2026-27 బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వైద్యారోగ్య శాఖకు రూ.13,679 కోట్ల భారీ కేటాయింపులు ప్రతిపాదించారు. 'తెలంగాణ రైజింగ్ విజన్-2047' లక్ష్యాలకు అనుగుణంగా మాతా శిశు ఆరోగ్యం, యువత సంక్షేమం, దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణతో పాటు మానసిక ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన వివరించారు.

అభివృద్ధి చెందిన దేశాల తరహాలో రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి 'హెల్త్ ప్రొఫైల్' సిద్ధం చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలందరి ఆరోగ్య సమాచారాన్ని క్రోడీకరించి వారికి డిజిటల్ హెల్త్ కార్డులు అందజేస్తామని, ఈ డేటా నిర్వహణలో అత్యంత గోప్యత పాటిస్తామని మంత్రి తెలిపారు. ప్రజల ఆరోగ్య రక్షణను ప్రాథమిక హక్కుగా భావిస్తూ, చికిత్స ఆధారిత వ్యవస్థ నుంచి వ్యాధి నిరోధక వైద్య సేవల (Preventive Healthcare) వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Telangana Budget 2026 Rs 13 679 Cr Allocated for Digital Health Cards and 17 New Medical Colleges

ఆసుపత్రుల బలోపేతం - కొత్త సేవలు

ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించే క్రమంలో జిల్లా కేంద్రాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, వృద్ధులకు ప్రత్యేక క్లినిక్స్, పాలియేటివ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేకంగా 'మైత్రి క్లినిక్స్' అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు గ్రాంట్-ఇన్-ఎయిడ్ సంస్థగా ఉన్న తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ను (TVVP), దాని పరిధిలోని 12,720 పడకలను పూర్తిస్థాయి ప్రభుత్వ సెకండరీ హెల్త్ కేర్ విభాగంగా మారుస్తున్నట్లు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం కాగితాలకే పరిమితం చేసిన మెడికల్, నర్సింగ్ కళాశాలల నిర్మాణ పనులను ప్రస్తుత ప్రభుత్వం వాస్తవ రూపంలోకి తెచ్చిందని మంత్రి పేర్కొన్నారు.

ప్రతి నెల రూ.2 వేల స్కాలర్ షిప్, విద్యార్థుల కోసం అభయహస్తం
ప్రతి నెల రూ.2 వేల స్కాలర్ షిప్, విద్యార్థుల కోసం అభయహస్తం

పడకల సంఖ్యలో సరికొత్త రికార్డు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందన్నారు భట్టి విక్రమార్క. 2024లో కొత్తగా 4,540 బెడ్స్ అందుబాటులోకి రాగా, 2026 చివరి నాటికి సనత్‌నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్‌లోని టిమ్స్ (TIMS) ఆసుపత్రులు, నిమ్స్ (NIMS) విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల ద్వారా మరో 6,582 పడకలు అందుబాటులోకి రానున్నాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం టెర్షియరీ కేర్ పడకల సంఖ్య 44,029కు చేరుకోనుంది. భారత ప్రజా ఆరోగ్య ప్రమాణాల (IPHS) ప్రకారం 'ప్రతి వెయ్యి మందికి ఒక పడక' ఉండాలన్న నిబంధనను తెలంగాణ గణనీయంగా అధిగమించడం గర్వకారణమని మంత్రి కొనియాడారు.

స్కూల్స్ లో బ్రేక్‌ఫాస్ట్.. ఇంటర్ విద్యార్ధులకు కొత్త పథకం
స్కూల్స్ లో బ్రేక్‌ఫాస్ట్.. ఇంటర్ విద్యార్ధులకు కొత్త పథకం

వైద్య విద్య విస్తరణ

వైద్య విద్యను సామాన్యులకు చేరువ చేసేందుకు ప్రభుత్వం యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టింది. కొత్తగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణం చేపడుతుండగా, ఇప్పటికే 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారా మెడికల్ కాలేజీలను ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. వీటి ద్వారా స్పెషలిస్ట్ వైద్యుల కొరత తీరడమే కాకుండా, సామాన్యులకు చేరువలో అత్యాధునిక వైద్యం అందుతుందని ప్రభుత్వం భరోసా ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+