మహిళలకు రూ 2500, పెన్షన్ల పెంపుపై బడ్జెట్ లో తేల్చిందిదే..!!

తెలంగాణ ప్రభుత్వం 2026-27 వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టింది. ఆర్దిక మంత్రి భట్టి విక్రమార్క రూ. 3,24,234 కోట్ల భారీ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ప్రభుత్వాల ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుతూ, ఆర్థిక క్రమశిక్షణతో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడమే లక్ష్యమ ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భట్టి స్పష్టం చేశారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు, రాజకీయ అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకుండా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అయితే, మూడు కొత్త పథకాలు ప్రకటించిన భట్టి... పెండింగ్ హామీల పైన స్పష్టత ఇవ్వలేదు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2026-28 వార్షిక బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. బడ్జెట్ రూ.3,24,234 కోట్లు గా ప్రతిపాదించారు. అందులో రెవెన్యూ వ్యయం రూ.2,34,406 కోట్లు గా..మూలధన వ్యయం రూ.47,267 కోట్లు గా పేర్కొన్నారు. తలసరి ఆదాయం రూ.4,18,931 కోట్లు గా వెల్లడించగా.. వృద్ధి రేటు 10.2శాతం గా బడ్జెట్ లో వివరించారు.

Telangana Budget Draws Criticism for Ignoring Assurances Pensions Provide Only Relief Here the details

కాగా, ఈ బడ్జెట్ లో రాష్ట్రంలో ని 1 కోటి 15 లక్షల కుటుంబాలకుప్రతి కుటుంబానికిఐదు లక్షల రూపాయల జీవిత బీమా అందించే విధంగా జూన్, 02, 2026 నుండి"ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం"నునూతనంగా ప్రవేశపెడ్తున్నట్లు వెల్లడించారు. అదే విధంగా విద్యార్ధులకు సంబంధించి రెండు కొత్త పథకాల అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల పీఆర్సీ, ఐఆర్ ప్రస్తావన లేదు. కాగా.. పెండింగ్ హామీల గురించి స్పష్టత వస్తుందని ఆశించారు.

పెండింగ్ హామీల అమలు పై లేని స్పష్టత

అయితే.. 2026-27 వార్షిక సంవత్సరంలో రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తామని భట్టి ప్రకటించారు. కాగా.. ఎన్నిక సమయంలో పెన్షన్లను రూ 4 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నారేళ్లు అవుతున్న వేళ ఈ బడ్జెట్ లో ఇందుకు సంబంధించి ప్రకటన ఉంటుందని భావించారు. అదే విధంగా మహిళలకు నెలకు రూ 2,500 ఇస్తామని ఇచ్చిన హామీ పైన ప్రకటన ఉంటుందనే ప్రచారం సాగింది.

ఈ రెండు పథకాలు ఆర్దిక భారం.. సమస్యల కారణంగా ఒకే సారి అమలు చేయక పోయినా.. విడతల వారీగా ఈ ఏడాది నుంచి అమల్లోకి తెస్తారనే వార్తలు వచ్చాయి. అయితే.. ఈ బడ్జెట్ లో పెండింగ్ లో ఉన్న ఈ రెండు హామీ ల గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇది మూడో బడ్జెట్. ఇందులోనూ ఈ హామీల ప్రస్తావన లేకపోవటంతో.. అసలు ఎప్పటి నుంచి వీటిని అమలు చేస్తారనేది ఇప్పుడు రాజకీయ చర్చగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+