ప్రాధాన్యతలు మారి కొంత ఇబ్బంది: బడ్జెట్‌పై ఈటెల
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ బుధవారం నాడు ఉదయం పది గంటలకు శాసన సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సంక్షేమం, వ్యవసాయం, ఉపాధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు.
ప్రజల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యతలు మారడంతో కొంత ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశ పెడుతోంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి మండలిలో బడ్జెట్ ప్రవేశ పెడతారు.

కాగా, బడ్జెట్ రూ.1.10 లక్షల కోట్లకు పైనే ఉండవచ్చు. తెలంగాణ బడ్జెట్‌లో ప్రణాళిక వ్యయం రూ.52వేల కోట్లు. సాగునీటి రంగాని, రుణమాఫీకి ప్రధాన్యత ఇవ్వనున్నారు. అన్ని వర్గాలను సంతృప్తిపరిచేలా బడ్జెట్ ఉంటుందని చెబుతున్నారు. బడ్జెట్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.












Click it and Unblock the Notifications