వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Telangana Budget 2023:తెలంగాణ ఆచరిస్తుంది.. దేశం అనుసరిస్తుంది: మంత్రి హరీష్ రావు

తెలంగాణ బడ్జెట్‌ సమావేశాలు 2023 లైవ్ అప్‌డేట్స్

|
Google Oneindia TeluguNews

సోమవారం ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టన్నారు. 2023-24 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈసారి తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396కోట్లుగా నిర్ణయించారు. రెవెన్యూ వ్యయం 2, 11,685 కోట్లు కాగా, పెట్టుబడి వ్యయం 37,525 కోట్లుగా మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 2023 - 24 తలసరి ఆదాయం మూడు లక్షల 17 వేల 175 రూపాయలుగా ఉందని పేర్కొన్న మంత్రి హరీష్ రావు వివిధ రంగాలకు బడ్జెట్ కేటాయింపులను వివరించారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులలో పెద్దపీట వేసినట్టుగా 26,831 కోట్లను కేటాయించారు. తెలంగాణ వైద్య ఆరోగ్య రంగానికి 12,161 కోట్లు కేటాయించారు. పల్లె ప్రగతి పంచాయతీరాజ్ శాఖకు 31,426 కోట్లు కేటాయించారు.

Telangana budget sessions 2023 live updates in telugu:Will it attract the common man

Newest First Oldest First
12:13 PM, 6 Feb

తెలంగాణ అభివృద్ధి నామూనాకు దేశం జేజేలు కొడుతోంది. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన మన మనోబలం చెక్కు చెదరదు.
12:12 PM, 6 Feb

తెలంగాణ ప్రభుత్వం సంక్షేమంలో స్వర్ణయుగం సృష్టించింది.
12:12 PM, 6 Feb

తెంలగాణ అభివృద్ధి స్ఫూర్తిదాయకంగా ఉంది.
12:11 PM, 6 Feb

ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నాం.
12:10 PM, 6 Feb

కాంట్రాక్టు ఉద్యోగులకు పే స్కేల్ సవరణ చేయబోతున్నాం.
12:10 PM, 6 Feb

ఇప్పటి వరకు 1 లక్ష 47 వేలకు పైగా ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తయింది.
12:09 PM, 6 Feb

స్థానిక అభ్యర్థలకు ఉద్యోగాల్లో 95 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.
12:07 PM, 6 Feb

తెలంగాణ ఉద్యోగులు దేశంలోకెల్లా అత్యధిక జీతాలు పొందుతున్నారు.
12:06 PM, 6 Feb

దేశంలో అత్యధికంగా సీసీ కెమెరాలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.
12:06 PM, 6 Feb

ప్రతి లక్ష జనాభాకు సగటున 19 ఎంబీబీఎస్‌ సీట్లతో వైద్య విద్యలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది.
12:03 PM, 6 Feb

టీ హబ్ ఎన్నో నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా మారింది.
12:02 PM, 6 Feb

కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో ఐటీ టవర్లను నిర్మించాం.
12:01 PM, 6 Feb

అనేక అంతర్జాతీయ కంపెనీలు తెలంగాణ పెట్టుబడులు పెడుతున్నాయి. అనేక మందికి ఐటీ కొలువులు లభించాయి.
12:00 PM, 6 Feb

టీఎస్ ఐపాస్ రాష్ట్రంలో విప్లవత్మక మార్పులు తీసుకొచ్చింది.
12:00 PM, 6 Feb

ధరణి ద్వారా రాష్ట్రంలో భూ వివాదాలను తగ్గించాం.
11:59 AM, 6 Feb

కొత్త జిల్లాలో ఏర్పాటుతో ప్రజలకు మేరుగైన సేవలు అందుతున్నాయి.
11:59 AM, 6 Feb

అమరవీరుల స్మారకర్థం అమరవీరుల స్మారకం త్వరలో ప్రారంభిస్తాం.
11:58 AM, 6 Feb

సచివాలయం పక్కకే డా. బీఆర్. అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం.
11:58 AM, 6 Feb

సెక్రటెరియట్ కు డా.బీఆర్ అంబేడ్కర్ పేరు పెట్టాం. ఈ సచివాలయాన్ని ఫిబ్రవరి 17 సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారు.
11:57 AM, 6 Feb

రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనే రోడ్లను నిర్మించాం. చాలా రోడ్లను డబుల్ రోడ్లుగా మార్చాం.
11:56 AM, 6 Feb

నాగార్జున సాగర్ లో బుద్ధవనం ప్రాజెక్టును నిర్మించాం.
11:55 AM, 6 Feb

యాదగిరిగుట్ట లక్ష్మినరసింహ స్వామి దేవాలయాన్ని భూలోక వైకుంఠంగా రూపొందించాం.
11:54 AM, 6 Feb

ఉత్తమ గ్రామపంచాయతీలకు అనేక అవార్డులు వచ్చాయి.
11:53 AM, 6 Feb

హైదరాబాద్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
11:51 AM, 6 Feb

అన్ని జిల్లాల‌కు కేసీఆర్ న్యూట్రిష‌న్ కిట్స్ విస్తరణ, కొత్తగా 4 లక్షల మంది గ‌ర్భిణీల‌కు ప్రయోజనం.
11:49 AM, 6 Feb

అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు ఏర్పాటు చేశాం. పల్లెప్రగతి ఇప్పటి వరకు 5 విడతలు పూర్తి చేశాం.
11:46 AM, 6 Feb

హైదరాబాద్‌ నగరం నలువైపులా సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోంది. 1100 కోట్ల ఖర్చుతో రెండు వేల బెడ్ల సామర్థ్యంతో వరంగల్‌లో హెల్త్‌ సిటీ నిర్మాణాన్ని ప్రారంభించింది.
11:42 AM, 6 Feb

బస్తీ దవాఖానాలతో ఎంతో మందికి వైద్య సౌకర్యం కల్పించాం.
11:40 AM, 6 Feb

రాష్ట్రంలో విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది. ‘మన ఊరు మన బడి’ ద్వారా పాఠశాలల అభివృద్ధి, యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పన, ఆంగ్ల మాధ్యమంలో బోధన ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలు ప్రభుత్వం చేపడుతోంది.
11:36 AM, 6 Feb

ఆర్థిక శాఖకు రూ.49,749 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.3,560 కోట్లు కేటాయింపు.
READ MORE

English summary
Telangana budget sessions 2023 live updates and highlights in telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X