కోదండరామ్, అజార్ కు కీలక పదవలు- జూబ్లీహిల్స్ బై పోల్ వేళ రేవంత్ మార్క్ గేమ్..!!
సీఎం రేవంత్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జూబ్లీహిల్స్ బై పోల్ వేళ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. సుప్రీంతీర్పుతో ఎమ్మెల్సీగా అవకాశం కోల్పోయిన ప్రొఫెసర్ కోదండరామ్ కు తిరిగి పదవి ఖరారు చేసారు. అదే విధంగా జూబ్లీహిల్స్ బై పోల్ లో తానే కాంగ్రెస్ అభ్యర్ధి అని ప్రచారం చేసుకుంటున్న అజాహరుద్దీన్ కు షాక్ ఇచ్చారు. ఆయనకు పోటీ లేకుండానే చట్ట సభలకు పంపే అవకాశం కల్పించారు. దీని ద్వారా జూబ్లీహిల్స్ లో రేవంత్ తన మార్క్ వ్యూహాలు అమలుకు సిద్దం అయ్యారు.
తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నాటి ఒప్పందంలో భాగంగా ప్రొఫెసర్ కోదండరామ్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఆయనతో పాటుగా అమీర్ అలీ ఖాన్ ను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేసారు. దీని పైన అప్పటికే గవర్నర్ కోటాకు సిఫారసు అయిన బీఆర్ఎస్ అభ్యర్ధులు న్యాయ పోరాటం చేసారు.

తాజాగా సుప్రీంకోర్టు తీర్పుతో కోదండ రామ్, అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా అవకాశం కోల్పోయారు. దీంతో, కోదండరామ్ కు తిరిగి ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తానని రేవంత్ తాజాగా ఉస్మానియా యూనివర్సిటీ సభలో ప్రకటించారు. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో తిరిగి గవర్నర్ కోటాలోనే ప్రొఫెసర్ కోదండరామ్ ను ఎమ్మెల్సీగా సిఫారసు చేస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేసారు.

కాగా, రెండో ఎమ్మెల్సీ విషయంలో రేవంత్ మార్క్ నిర్ణయం జరిగింది. అలీ ఖాన్ స్థానంలో అనూహ్యంగా అజాహరుద్దీన్ ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసారు. జూబ్లీహిల్స్ బై పోల్ లో తానే కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేస్తానని అజార్ చెబుతూ వచ్చారు. ప్రచారం ప్రారంభించారు. అయితే, తాజా ఢిల్లీ పర్యటనలో బై పోల్ లో గెలవాలంటే మైనార్టీ అభ్యర్ధి కాకుండా.. బీసీ అభ్యర్ధిని ఎంపిక చేయాల్సి ఉందని రేవంత్ పార్టీ అధినాయకత్వానికి వివరించారు.
దీంతో... అజార్ కు పోటీ లేకుండానే చట్ట సభకు ఎంపిక చేసారు. ఇప్పుడు జూబ్లీహిల్స్ లో బీసీ అభ్యర్ధిని అధికారికంగా కాంగ్రెస్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇక.. రిజర్వేషన్ల విషయంలోనూ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. బీసీ రిజర్వేషన్ల అమలుకు వీలుగా జీవో ఇవ్వటం ద్వారా.. సెప్టెంబర్ లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం ఎన్నికల సంఘానికి లేఖ రాసంది.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications