రేపే కేబినెట్ సమావేశం.. కీలక ప్రకటన దిశగా రేవంత్ సర్కార్..!
అక్టోబర్ 23 గురువారం రోజున తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై రాష్ట్ర మంత్రి వర్గం చర్చించనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా, నీటిపారుదల ప్రాజెక్టులు.. తదితర అంశాలపై సమగ్రంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేపటి కేబినెట్ సమావేశం అనంతరం ఒకటి రెండు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.
తెలంగాణ కేబినెట్ సమావేశం అక్టోబర్ 23 న జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం అందుతోంది. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులపై తదుపరి చర్యలు తీసుకోనున్నారు.
అంతేకాక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు సాధ్యాసాధ్యాలపైనా రేపటి కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర మంత్రి వర్గం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇద్దరు పిల్లల నిబంధనను రద్దు చేసే ఆర్డినెన్స్ కు ఆమోదం తెలపనున్నట్లు సమాచారం. అంతేకాక కాళేశ్వరం ప్రాజెక్ట్ పునరుద్ధరణ పనులు, ఎస్ఎల్బీసీ పనులు, ఎస్సారెస్పీ రెండో దశ.. తదితర నీటిపారుదల ప్రాజెక్టులపైనా తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల అక్టోబర్ 16 న జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఇద్దరి కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న వారు స్థానిక సంస్థల్లో పోటీ చేయరాదన్న నిబంధనను తొలగించాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే రాష్ట్రంలో హ్యామ్ విధానంలో మొదటి దశలో రూ.10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే అంశంపై మంత్రివర్గం చర్చలు జరిపింది. ఈ విషయంపై లోతుగా అధ్యయనం చేసేందుకు సీఎస్ నేతృత్వంలో ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు అక్టోబర్ 23న మరోసారి సమావేశం కావాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.












Click it and Unblock the Notifications