కేబినెట్ సమావేశం: వీరికి కొత్త పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పై కీలక నిర్ణయాలు..!!

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలకు సిద్దమైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ కొత్త పథకాలు.. పాలసీలకు ఆమోద ముద్ర వేయనుంది. ఈ రోజు జరిగే కేబినెట్ భేటీలో 15 కీలక అంశాల పైన చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రెండు లక్షల మందికి కొత్తగా పెన్షన్లు.. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ప్రతీ ఇంటికి భీమా పథకం తో పాటుగా ఇంటి స్థలాల కేటాయింపు పైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు. బడ్జెట్ లో ప్రకటించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా పథకం విధి విధానాలను ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపునకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. సవరించిన భూముల మార్కెట్ విలువల ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. అదే విధంగా రెండు లక్షల మందికి కొత్తగా ఆసరా పింఛన్ల మంజూరుకు కేబినెట్ అంగీకారం తెలపనున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే హామీ ఇచ్చిన విధంగా ఫ్యూచర్‌ సిటీలో ప్రజా ప్రతినిధులు, సివిల్ సర్వీసెస్ అధికారులు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది . ధాన్యం సేకరణ, ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, ఇరిగేషన్ ప్రాజెక్టులు, హ్యామ్ రోడ్లపై ఈ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.

త్రిషకు విజయ్ ఊహించని పదవి,కేరాఫ్ ఢిల్లీ - అక్కడే అసలు ట్విస్ట్..!!
త్రిషకు విజయ్ ఊహించని పదవి,కేరాఫ్ ఢిల్లీ - అక్కడే అసలు ట్విస్ట్..!!
telangana-cabinet-expected-to-clear-several-major-programmes-and-policy-initiatives-during-state-for

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేళ కొత్త పథకాలు

జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేళ కొత్త పథకాలను ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయించారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంలో భాగంగా కుటుంబ యజమాని మరణిస్తే రూ.5 లక్షల బీమా పరిహారం అందేలా పథకం అమలు చేయనున్నట్లు బడ్జెట్ లో ప్రకటించారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.4 వేల కోట్లు కేటాయించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం రెండో విడత మంజూరు పైన నిర్ణయం తీసుకోనున్నారు. కాగా, సవరించిన భూముల మార్కెట్ విలువలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. భూముల మార్కెట్‌ విలువల సవరణపై అధికారులు పలు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భూముల రిజిస్ట్రేషన్ విలువ కనీసం 5 నుంచి 100 శాతం వరకు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్దం చేసినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా రెండు లక్షల మందికి ఆసరా పింఛన్లను జూన్ 2 నుంచి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రైవేట్‌ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సులపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+