తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి గ్రీన్ సిగ్నల్: త్వరలోనే 4 లక్షల మందికిపైగా కార్డులు
హైదరాబాద్: రాష్ట్రంలో ఎంతో కాలంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ అందించింది. మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యతన జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది.
Recommended Video
పెండింగ్‌లో 4,46,169 మంది అర్హులకు వెంటనే రేషన్ కార్డులు మంజూరు చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. 15 రోజుల్లోగా రేషన్ కార్డులిచ్చే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను తెలంగాణ మంత్రివర్గం ఆదేశించింది.

మరోవైపు ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సభ్యులుగా ఉంటారని పేర్కొంది. ప్రజా పంపిణీ వ్యవస్థలో సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకోవాలని ఈ కమిటీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.
ఐరిష్ విధానంపై హైకోర్టులో విచారణ
తెలంగాణలో కరోనా తీవ్రత కారణంగా రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీకి ఐరిస్ విధానం అమలు చేయొద్దని దాఖలైన్ పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. కంటి ద్వారా కరోనా సోకే ప్రమాదం ఉన్నందున ఐరిస్ విధానం అమలు చేయొద్దని హైదరాబాద్ కు చెందిన ప్రకాశ్, జ్జు, మాలన్ బేగం దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయసేన్ రెడ్డిల ధర్మాసనం విచారణ చేపట్టింది.
ఐరిస్ ద్వారా కాకుండా ఇతర ధృవీకరణతో రేషన్ ఇవ్వాలని కోరారు. అయితే, కంటి ద్వారా కరోనా సోకదని వైద్య నిపుణులు చెబుతున్నారని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వానదలు విన్న హైకోర్టు ధర్మాసనం.. ఐరిస్ యంత్రం ఎంత దూరంలో ఉంటుంది? కరోనా నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పౌర సరఫరా శాఖ కార్యదర్శి, కమిషనర్‌ను ఆదేశించింది. జులై 22కు తదుపరి విచారణను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications