10 తెలంగాణ కేబినెట్ భేటీ: కీలక చర్చ, బీజేపీతో యుద్ధమేనంటూ టీఆర్ఎస్ ఎంపీలకు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 10న మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం జరగనుంది.

ధాన్యం కొనుగోళ్లు, రైతు బంధు నిధుల విడుదల, సొంత స్థలాలున్న బలహీనవర్గాలకు గృహ నిర్మాణం, దళితబంధు అమలు, తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాలు, ఆర్థిక పరిస్థితులు, కేంద్రం ఆంక్షలపైనా చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 Telangana cabinet meeting on 10th december: KCR suggestions to TRS MPs

బీజేపీతో యుద్ధమేనంటూ ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం

మరో రెండ్రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్న తరుణంలో టీఆర్ఎస్ ఎంపీలకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. సోమవారం సీఎం కేసీఆర్‌తో లోక్‌సభ, రాజ్యసభపక్ష నేతలు కే కేశవరావు, నామ నాగేశ్వరరావుతోపాటు పలువురు టీఆర్ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు.

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాష్ట్రం, టీఆర్ఎస్ తరపున లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఢిల్లీ పరిణామాలపైనా చర్చించినట్లు తెలిసంది. రాష్ట్రం పట్ల కేంద్రం అనుసరిస్తున్న కక్షపూరిత విధానాలను సభలో ప్రస్తావించాలని ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+