కొత్త జిల్లాలకు ఆర్డినెన్స్: తెలంగాణ కేబినెట్ నిర్ణయం
హైదరాబాద్: శుక్రవారం తెలంగాణ మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు తుది నోటిఫికేషన్‌కు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దసరా నుంచి కొత్త జిల్లాలను ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. సిద్ధిపేట, కరీంనగర్, నిజామాబాద్ పోలీసు కమిషనరేట్‌లకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడారు. ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలన్న అంశంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు.












Click it and Unblock the Notifications