ఎమ్మెల్సీ ఫలితాలతో రూటు మార్చిన రేవంత్..!!
తెలంగాణ రాజకీయం అనూహ్య టర్న్ తీసుకుంటోంది. అనూహ్య పరిణామాలు చోట చేసుకుంటు న్నాయి. ఎమ్మెల్సీ ఫలితాలతో కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఈ ఫలితాలతో సీఎం రేవంత్ అలర్ట్ అయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ సీటు కోల్పోవటంతో..భవిష్యత్ పైన ఫోకస్ చేసారు. రూటు మార్చారు. అందులో భాగంగా కొత్త నిర్ణయాల దిశగా కసరత్తు చేస్తున్నారు. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నారు.
మంత్రివర్గ భేటీలో
తెలంగాణ మంత్రివర్గ భేటీ ఈ రోజు జరగనుంది. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాల వేళ ఈ భేటీ కీలకంగా మారుతోంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ నెల 10 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పైన ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఈ సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నారు. ఇక.. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42శాతం రిజర్వేషన్లు ఇచ్చే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జస్టిస్ షమీమ్ అఖ్తర్ కమిషన్ సిఫార్సుల్లో మూడింటిని ఇప్పటికే ఆమోదించిన కేబినెట్.. ఆ తర్వాత వచ్చిన అభ్యంతరాలను పరిశీలించి చర్చించనుంది.

కీలక బిల్లులు
అదే సమయంలో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కోసం బిల్లుపై చర్చించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణపై ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరపాలా, బడ్జెట్ సెషన్‌లోనే బిల్లులు ప్రవేశపెట్టాలా అనే విషయంపై కేబినెట్‌లో స్పష్టత రానుంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ ఢిల్లీలో ప్రధానితో భేటీ అయ్యారు. ఆ సమయంలో ప్రధాని నుంచి వచ్చిన స్పందన గురించి మంత్రులతో రేవంత్ వివరించనున్నారు. ఏపీతో నీటి వివాదంపై అనుసరించాల్సిన వ్యూహం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. హెచ్ఎండీఏ విస్తరణ పైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
ఫలితాల వేళ
అధికారిక అజెండా తరువాత రాజకీయ అంశాల పైన చర్చ జరిగే అవకాశం ఉంది. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిట్టింగ్ సీటు ఓడిపోయింది. మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్య లో ఉన్నా సిట్టింగ్ సీటు కోల్పోవటాన్ని సీఎం రేవంత్ సీరియస్ గా తీసుకున్నారు. అనూహ్యంగా బీజేపీ సీటు గెలవటం తో భవిష్యత్ కార్యాచరణ పైన ఫోకస్ చేసారు. ఇక, బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశ పెట్టే బిల్లులు.. బడ్జెట్ ముహూర్తం పైన నిర్ణయం తీసుకోనున్నారు. రాజకీయంగానూ మంత్రు లకు సీఎం రేవంత్ దిశా నిర్దేశం చేయనున్నారు.












Click it and Unblock the Notifications