కేసీఆర్ టీం 'ఫిక్స్', కీలక నిర్ణయం - నెక్స్ట్ ఇక..!!
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయానికి సిద్దమైంది. రాజకీయంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాజకీయంగా కొత్త మలుపుకు కారణం కానుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంలో అవకతవకతలపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై చర్యలకు రంగం సిద్దం చేసారు. మాజీ సీఎం కేసీఆర్ సహా ఆయన టీం ఈ వ్యవహారంలో ఫిక్స్ అయినట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. అటు కేసీఆర్ సైతం కమిషన్ విచారణ నివేదిక..భవిష్య్ కార్యాచరణ పైన పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. దీంతో, ఇప్పుడు ప్రభుత్వం తదుపరి నిర్ణయం ఏంటనేది ఉత్కంఠ పెంచుతోంది.
కీలక భేటీ
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా మాజీ మంత్రులు చిక్కుల్లో పడ్డారు. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ రోజు మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. చంద్రఘోష్ కమిషన్ సమర్పించిన నివేదికపై ఈ సమావేశంలో చర్చిస్తారు. కమిషన్ ఇచ్చిన నివేదిక పైన అధికారులు పది పేజీల నోట్ ను కేబినెట్ కు సమర్పించేందుకు సిద్దమయ్యారు. ఇందులో నాటి పాలకుల నిర్లక్ష్యంతో పాటుగా థర్డ్ పార్టీ ప్రమేయం పైన ప్రధానంగా ప్రస్తావన చేసినట్లు సమాచారం. దీంతో, బాధ్యులపై ఏసీబీతో అవినీతి నిరోధక చట్టం కింద విచారణ జరిపించాలా లేక సిట్ ఏర్పాటు చేయాలా అనే అంశాలను మంత్రివర్గం పరిశీలించే అవకాశం ఉంది.

వాట్ నెక్స్ట్
అయితే, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించనుందని సమాచారం. ఇదే అంశంపై ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలను కూడా నిర్వహించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాళేశ్వరం.. ప్రజాధనం వృథా చేసిన ప్రాజెక్టుగా మారిందంటూ విచారణ కమిషన్ చెప్పిన వివరాలను ప్రజలకు వివరించేందుకు సర్కారు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. ఈ మొత్తం వ్యవహారంపై.. నేటి మంత్రివర్గ సమావేశంలో చర్చించి, కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రాజెక్టు అవకతవకల వెనుక ఉన్న రాజకీయ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి ..అధికారులపై ఏ విధమైన చర్యలకు ఉపక్రమించాలనే విషయాలపైనా చర్చించనున్నారు.
కఠిన చర్యలు
అదే విధంగా.. శాసనసభ సమావేశాలు నిర్వహించి, సభ్యులందరికీ విచారణ కమిషన్ నివేదికను అందించి.. దానిపై చర్చ జరపాలనే యోచనలోనూ సర్కారు ఉన్నట్టు సమాచారం. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిర్మించాలనే నిర్ణయం ప్రభుత్వానిది కాదని, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వ్యక్తిగతంగా తీసుకొన్నారని, బ్యారేజీలు దెబ్బ తినడానికి కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాలు కారణమని కమిషన్ పేర్కొన్నట్లు సమాచారం. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, కాళేశ్వరం నిర్మాణ సమయంలో నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్.కె.జోషి, అప్పటి సీఎంవోలోని ఓఎస్‌డీ స్మితా సబర్వాల్‌తో పాటు మాజీ ఈఎన్సీలు, మాజీ సీఈలు, ప్రస్తుత ఈఎన్సీలు టి.శ్రీనివాస్, హరిరాం, సీఈలు సుధాకర్‌రెడ్డి, ప్రమీల పాత్రను వెల్లడించినట్లు తెలిసింది. దీంతో, ఈ రోజు జరిగే మంత్రివర్గ భేటీ.. తుది నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications